వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ లీడర్లే టార్గెట్?: భీకర ఎన్‌కౌంటర్లో 17 మంది జవాన్లు మృతి, పలువురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో సుమారు 24 గంటలపాటు పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 17 మంది జవాన్లు మృతి చెందారు. ఆదివారం వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. గాయపడిన జవాన్లను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

కూంబింగ్ నిర్వహిస్తుండగా కాల్పులకు తెగబడ్డ మావోలు..

కూంబింగ్ నిర్వహిస్తుండగా కాల్పులకు తెగబడ్డ మావోలు..

చింతగుఫా అటవీ ప్రాంతంలో 150 మంది జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారు. శనివారం సాయంత్రం నుంచి ఈ కాల్పులు ఆదివారం తెల్లవారుజాము వరకు కొనసాగినట్లు తెలుస్తోంది.

అంతకుముందు సుకుమా ఎస్పీ శలభ్ సిన్హా ఈ ఎదురుకాల్పులపై మాట్లాడుతూ.. కనిపించకుండా పోయిన జవాన్ల గురించిన సమాచారం తమకు ఇప్పటి వరకు అందలేదని చెప్పారు. తీవ్రంగా గాయపడిన 14 మంది జవాన్లను శనివారం రాత్రి రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని భావిస్తున్నట్లు చెప్పారు.

కాల్పుల్లో 17 మంది మృతి..

కాల్పుల్లో 17 మంది మృతి..

అయితే, ఆ తర్వాత 17 మంది జవాన్లు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు చింతగుఫా ప్రాంతంలోని కోర్జాగూడ కొండల వద్ద మావోయిస్టులకు, డీఆర్జీ పార్టీకి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు.

250 మంది మావోల కాల్పులు.. తెలంగాణలో భారీ విధ్వంసానికి ప్లాన్?

250 మంది మావోల కాల్పులు.. తెలంగాణలో భారీ విధ్వంసానికి ప్లాన్?

మావోయిస్టులు పెద్ద ఎత్తున సంచరిస్తున్నారన్న సమాచారంతో ఎల్మగుండా ప్రాంతంలోని చింతగుఫా, బుర్కపాల్, టైమిలీడ పరిసరాల్లో డీఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్ బలగాలు సంయుక్తంగా 600 మంది సిబ్బందితో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయని అధికారులు వెల్లడించారు. కోరజగూడ కొండల వద్దకు చేరగానే 250 మంది మావోయిస్టులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారని తెలిపారు. ఈ కాల్పుల అనంతరం జవాన్ల వద్ద ఉన్న తుపాకులను మావోయిస్టులు ఎత్తుకెళ్లారని అధికారులు తెలిపారు. మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ తోపాటు తెలంగాణలో భారీ విధ్వంసానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం ఉందని పోలీసు అధికారులు చెప్పారు.

తెలంగాణ అధికార పార్టీ నేతల టార్గెట్.. హైదరాబాద్‌లోనే మకాం...

తెలంగాణ అధికార పార్టీ నేతల టార్గెట్.. హైదరాబాద్‌లోనే మకాం...

మావోయిస్టులు తెలంగాణలోని కీలక రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కీలక నేతలకు మావోయిస్టుల నుంచి ప్రమాదం పొంచివుందనే సమాచారం రావడంతో కీలక నేతలు అప్రమత్తమయ్యారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలోనే ఈ జిల్లాలకు చెందిన పలువురు అధికార పార్టీకి చెందిన నేతలు గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసినట్లు తెలుస్తోంది.

English summary
24 Hours gun batte With Naxals: 17 Soldiers Missing, Many Feared Dead in Chhattisgarh's Sukma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X