వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కబళించిన ప్రమాదం, ట్రక్కు-లారీ ఢీ.. 24 మంది వలసకూలీల మృతి, 30 మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔరాయియా వద్ద ట్రక్కు-డీసీఎం లారీనీ ఢీ కొంది. శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 24 మంది వలసకూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరో 30 మంది గాయపడ్డారు. వలసకూలీలు తమ స్వగ్రామం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.

23 migrants dead, 15 injured as truck rams into lorry

Recommended Video

CM YS Jagan Key Announcement Of Janata Bazars In Every Village

ప్రమాదం జరిగిన చోటుకు అధికారులు, పోలీసులు చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రి, సైఫాయి పీజీఐ ఆస్పత్రికి తరలించారు. లాక్ డౌన్ వల్ల ఉన్న చోట పని లేకపోవడంతో వలసకూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను కూడా నడుపుతోంది. అయితే దానికి ఆప్లికేసన్ ప్రాసెస్ ఉండటం, ఎప్పుడూ తమ నంబర్ వస్తుందో తెలియకపోవడంతో.. వలసకూలీలు వెళుతున్నారు. కొందరు నడిచి వెళ్తుంటే.. మరికొందరు ట్రక్కులలో వెళ్తు.. ఇలా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.

ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదం చాలా విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారు వేగంగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.

English summary
24 migrant workers died and 30 were seriously injured after a truck rammed into a DCM lorry they were travelling in to the native place. incident happened on Saturday morning in uttar pradesh Auraiya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X