వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24 విమానాలతో భారత భూభాగంలోకి పాకిస్తాన్, అడ్డుకున్న 8 భారత విమానాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడి అనంతరం, భారత్ పాకిస్తాన్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో భారత్ కీలక మిలటరీ స్థావరాలపై దాడికి ప్రయత్నం చేసింది. కానీ దీనిని భారత్ సమర్థవంతంగాతిప్పికొట్టింది.

బుధవారం మొత్తం 24 యుద్ధవిమానాలు ఒక్కసారిగా భారత్‌ భారత భూభాగంలోకి చొరబడ్డాయి. ఉదయం 9.45 సమయంలో పాకిస్తాన్ ఎఫ్ 16లు, నాలుగు మిరాజ్‌ 3, నాలుగు జేఎఫ్ 17 విమానాలు సమూహంగా నియంత్రణ రేఖ దాటి చొచ్చుకొచ్చాయి. వీటికి రక్షణగా కొన్ని విమానాలు నియంత్రణ రేఖకు అవతలవైపు సిద్ధంగా ఉన్నాయి.

24 Pak Jets Tried To Cross Over, Intercepted By 8 Air Force Fighters

ఎల్వోసీ దాటిన పాక్‌ విమానాలను భారత వాయు సేనకు చెందిన ఎనిమిది విమానాలు అడ్డుకొన్నాయి. వీటిల్లో నాలుగు సుఖోయ్ 30లు, రెండు మిరాజ్ 2000, రెండు మిగ్ 21 బైసన్‌లు ఉన్నాయి.

మిగ్ 21లలో ఒక దానిని వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ నడిపారు. అతడు ఒక ఎఫ్ 16 పైకి ఆర్ 73 క్షిపణిని ప్రయోగించాడు. మరోవైపు నుంచి పాక్ ఎఫ్ 16 కూడా రెండు ఏఎంఆర్‌ఏఏఎం క్షిపణులను ప్రయోగించింది. ఇందులో ఒకటి అభినందన్‌ విమానాన్ని తాకింది.

ఈ క్రమంలో ఎఫ్ 16 విమానం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో భూభాగంలో కూలిపోయింది. ‌ రెండు విమానాల్లో పైలట్లు ఎల్వోసీ అవతల నేలపైకి దిగారు. భారత్‌కు చెందిన వింగ్ కమాండర్‌ అభినందన్‌ మాత్రం పాక్‌ ఆధీనంలో ఉన్నట్లు వెల్లడైంది. శుక్రవారం అతన్ని పాక్ విడుదల చేయనుంది.

పాక్ తొలుత ఇద్దరు భారత పైలట్లను బంధించినట్లు చెప్పింది. ఆ తర్వాత మాట మార్చి, ఒక పైలట్‌ను బంధించినట్లు తెలిపింది. అభినందన్ వివరాలు ఇచ్చినప్పటికీ, మరో పైలట్ వివరాలు చెప్పలేదు. అప్పుడే అనుమానం వచ్చింది. భారత్‌కు చెందిన రెండు విమానాలు కూల్చినట్లు అబద్దమాడింది. కానీ అందులో ఒక విమానం పాకిస్తాన్‌దే. ఆధారాలు ఉన్నాయి.

English summary
As India waited for the release of Wing Commander Abhinandan Varthaman, who is in Pakistan's custody, exclusive details emerged on the unprecedented air combat operation along the Line of Control, where a package of 24 Pakistani aircraft were intercepted by eight IAF fighters, which included a MiG 21 Bison he was piloting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X