వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌కు మరో 25 కంపెనీల బలగాలు..! ఇంతకీ అక్కడ ఏం జరగబోతోంది..?

|
Google Oneindia TeluguNews

జమ్మూ కాశ్మీర్‌లో ఏం జరుగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. గత వారం 10వేల మంది భద్రతా సిబ్బందిని లోయకు పంపిన కేంద్రం.. తాజాగా మరిన్ని బలగాలను మోహరించింది. గురువారం సాయంత్రం కాశ్మీర్ లోయలో 250 కంపెనీల పారామిలటరీ బలగాలు మోహరించాయి. దీంతో లోయలో ఏం జరుగుతుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

కాశ్మీర్ లోయలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పారా మిలటరీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 28వేల మంది భద్రతా సిబ్బందిని కేంద్రం హఠాత్తుగా కాశ్మీర్‌కు తరలించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. భద్రతా బలగాల్లో ఎక్కువ మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు. శ్రీనగర్‌ను సెక్యూరిటీ సిబ్బంధి తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. వారితో పాటు స్థానిక పోలీసులు సైతం విధులు నిర్వహిస్తున్నారు.

25,000 More Troops Being Moved To Kashmir

ఒక్కసారిగా దాదాపు 35 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ మొత్తంలో నిత్యావసర వస్తువులను తెచ్చుకుని నిల్వచేసుకుంటున్నారు.

కేంద్రం గత వారమే 100కంపెనీల పారమిలటరీ బలగాలను కాశ్మీర్‌కు పంపింది. చొరబాటుదారుల్ని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ రెండు రోజుల పర్యటన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మరో 25వేల బలగాలను మోహరించడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆర్టికల్ 35 ఎను రద్దు చేసే లక్ష్యంతోనే కేంద్రం బలగాలను పంపిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Less than a week after moving 10,000 troops of paramilitary forces to Kashmir, the centre is rushing about 25,000 more paramilitary personnel to the Valley, as part of a massive security drive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X