వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైవేపై ఢీ కొన్న కార్లు... కిలో మీటర్ మేర వాహనాలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు జనజీవనాన్ని స్తంభింపజేసింది. బుధవారం ఉదయం కురిసిన పొగమంచు కారణంగా ఢిల్లీకి సమీపాన యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు కార్లు ఒకదానికొకటి ఢీకున్నాయి. దీంతో వెనుక వస్తున్న 25 వాహనాలు ఈ ప్రమాదంలో క్రాష్ అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా... 25 మంది వరకు గాయపడ్డారు.

దీంతో గ్రేటర్ నోయిడాలో ఉదయం 9 గంటల ప్రాంతంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఇండస్ట్రీలతో పాటు పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉంటే యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఈ ప్రమాదంతో జనజీవనానికి ఇబ్బంది తలెత్తింది.

కిలోమీటర్ల వాహనాలు నిలిచిన వాహనాలను మధ్యాహ్నానికి క్లియర్ చేశారు. ప్రత్యక్ష సాక్షి తెలిపిన సమాచారం మేరకు యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వస్తున్న ఓ కారు, మరో లేన్ లోకి వెళ్లే ప్రయత్నంలో పొగమంచు చేత కనిపించక పోవడంతో మరో కారుని ఢీ కొట్టాడని వెల్లడించారు.

కాగా, పొగమంచు దట్టంగా అలముకోవడంతో కాంతి మందగించి రైళ్లు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 70 రైళ్లు వరకు రద్దయ్యాయి. ఢిల్లీకి రావాల్సిన 57 రైళ్లు ఆలస్యంగా రానున్నాయి. పొగమంచు కారణంగా 30 విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది.

 రెండు కార్లు ఢీ, కిలో మీటర మేర నిలిచిన వాహనాలు

రెండు కార్లు ఢీ, కిలో మీటర మేర నిలిచిన వాహనాలు

ఢిల్లీలో ఉదయం పూట పొగమంచు కారణంగా రోడ్లపై ఉన్న సిగ్నల్స్‌ను పరిశుభ్రం చేస్తున్న సిబ్బంది.

 రెండు కార్లు ఢీ, కిలో మీటర మేర నిలిచిన వాహనాలు

రెండు కార్లు ఢీ, కిలో మీటర మేర నిలిచిన వాహనాలు

ఢిల్లీలో ఉదయం పూట పొగమంచు కారణంగా స్కూలు విద్యార్ధులు స్వెట్టర్ల కప్పుకుని మరీ స్కూలుకి వెళ్తున్న దృశ్యం.

 రెండు కార్లు ఢీ, కిలో మీటర మేర నిలిచిన వాహనాలు

రెండు కార్లు ఢీ, కిలో మీటర మేర నిలిచిన వాహనాలు

ఢిల్లీలో ఉదయం పూట పొగమంచు కారణంగా పొయ్యిని వెలిగించేందుకు నానా అవస్ధలు పడుతున్న చిన్నారులు.

రెండు కార్లు ఢీ, కిలో మీటర మేర నిలిచిన వాహనాలు

రెండు కార్లు ఢీ, కిలో మీటర మేర నిలిచిన వాహనాలు

పొగమంచులోనే పనులకు వెళ్తున్న ఢిల్లీ వాసులు. దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు జనజీవనాన్ని స్తంభింపజేసింది.

 రెండు కార్లు ఢీ, కిలో మీటర మేర నిలిచిన వాహనాలు

రెండు కార్లు ఢీ, కిలో మీటర మేర నిలిచిన వాహనాలు

గతంలో ఎన్నడూ లేనంత విధంగా అత్యల్ప ఉష్ణోగ్రత ఢిల్లీలో నమోదైందని అధికారులు వెల్లడించారు. పొగమంచుని తట్టుకునేందుకు స్వెట్టర్లును ఆశ్రయిస్తున్న ఢిల్లీ ప్రజలు.

 రెండు కార్లు ఢీ, కిలో మీటర మేర నిలిచిన వాహనాలు

రెండు కార్లు ఢీ, కిలో మీటర మేర నిలిచిన వాహనాలు

కూలీ పని చేసుకునే వారు ఉదయం పొగమంచులోనే పనులకు వెళ్తున్న దృశ్యం.

English summary
On a cold and densely foggy morning in Delhi, nearly 25 vehicles crashed into each other on a major highway near Delhi, killing two people. 25 people have been injured in the massive pile-up on the Yamuna Expressway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X