వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: స్కూల్ బస్సు, ట్రక్ ఢీ: 25 మంది దుర్మరణం

ఉత్తరప్రదేశ్ లోని ఎటా జిల్లా లోని ఆలిగంజ్ లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జేఎస్ పబ్లిక్ స్కూల్ కు చెందిన పిల్లలు వెలుతున్న బస్సును ఓ ట్రక్ ఢీకొనింది. ఈ ప్రమాదంలో 18 మంది స్కూల్.

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ విషాదంలో మునిగిపోయింది. యూపీలోని ఎటా జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది స్కూల్ పిల్లలతో సహ 25 మంది దుర్మరణం చెందారు. అనేక మందికి తీవ్రగాయాలై మృత్యువుతో పోరాడుతున్నారు.

గురువారం ఎటాలోని జేఎస్ కే పబ్లిక్ స్కూల్ కు చెందిన పిల్లలు బస్సులో బయలుదేరారు. మార్గం మద్యలో ఆలిగంజ్ లో స్కూల్ పిల్లలు వెలుతున్న బస్సును ఓ ట్రక్కు డీకొనింది. ఈ ప్రమాదంలో 22 మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.

25 feared dead after school bus collides with truck in Uttar Pradesh

విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో పిల్లల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్షం కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు.

50 మందికి పైగా తీవ్రగాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై మరో ముగ్గురు మరణించారని పోలీసులు చెప్పారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేసినట్లు ప్రధాని కార్యాలయం నుంచి ప్రకట వెలువడింది.

English summary
At least 25 people including 18 school children were killed and 50 injured as a school bus was hit by a truck on Thursday in Etah district. The bus was ferrying students to Aliganj's JS Public School in Etah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X