వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25 ఏళ్ల సీఏ స్టూడెంట్‌ను బంధించిన పేరంట్స్.. 6 నెలలు చీకటిలో, ఏమిచ్చారంటే..

|
Google Oneindia TeluguNews

కాలం మారుతోంది. కానీ జనం మాత్రం మారడం లేదు. మూఢ విశ్వాసాలతో ముందుకెళ్తున్నారు. కొన్ని ఘటనల గురించి తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. అయితే రాజ్‌కోట్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ 25 ఏళ్ల సీఏ విద్యార్థిని ఫ్యామిలీ మెంబర్స్ వేధించారు. 6 నెలలు గదిలో బంధించారు. వారానికోసారి ఆహారం ఇచ్చేవారు. విషయం తెలిసిన చుట్టుపక్కల వారు అడిగినా చెప్పేవారు కాదు. కానీ చివరికీ తెలిసి.. పోలీసులు, ఎన్జీవో ప్రతినిధులు ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఆ యువతి చనిపోయింది.

రాజ్ కోట్‌లో గల సాదువసనీ రోడ్‌లో ఓ ఫ్యామిలీ ఉంటోంది. అందులో అల్పా సెజ్ పాల్ అనే యువతి.. సీఏ చేస్తోంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆమెను గదిలో బంధించారు. వారానికో సారి ఆహారం ఇచ్చేవారు. దీంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఆమెకు మంచినీరు ఇవ్వడంతో.. గదిలో ఉన్న సంచి నిండిపోయి కనిపించింది. ఆమెకు యూరిన్ కూడా ఇచ్చేవారు అని గదిలో ఉన్న వస్తువులను బట్టి తెలిసింది.

25 year old woman locked in room for six months dies after being rescued

కోమాలో ఉన్న అల్పాను ఆస్పత్రిలో చేర్చారు. అయితే అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రిలో ఆమె చనిపోయారు. పేరంట్స్ వల్లే చనిపోయారని పోలీసులు/ ఎన్జీవో ప్రతినిధులు భావిస్తున్నారు. అల్పా తల్లిని పోలీసులు అనుమానిస్తున్నారు. అల్పాపై క్షుద్రపూజలు కూడా చేశారని సస్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఏం జరిగిందో తెలియరాలేదు. ఈ కాలంలో కూడా క్షుద్ర పూజల కలకలం నెలకొంది.

English summary
25-year-old woman was locked in a room at her residence in Rajkot allegedly by her family for over six months
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X