25 ఏళ్ల తర్వాత తండ్రి కోరిక నెరవేర్చిన యూపీ అమ్మాయి
ఉత్తర ప్రదేశ్‌లో ఓ యువతి తన తండ్రి చనిపోయిన 25 ఏళ్ల తర్వాత అతని కోరికను నెరవేర్చింది. జడ్జి కావాలని చిన్నతనంలో తన తండ్రి చెప్పిన మాటలను ఆమె గుర్తుంచుకుంది. పాతిక సంవత్సరాల తర్వాత ఆయన కలను నెరవేర్చింద
ముజఫర్ నగర్: ఉత్తర ప్రదేశ్‌లో ఓ యువతి తన తండ్రి చనిపోయిన 25 ఏళ్ల తర్వాత అతని కోరికను నెరవేర్చింది. జడ్జి కావాలని చిన్నతనంలో తన తండ్రి చెప్పిన మాటలను ఆమె గుర్తుంచుకుంది. పాతిక సంవత్సరాల తర్వాత ఆయన కలను నెరవేర్చింది.
ముజఫర్ నగర్‌కు చెందిన అంజుమ్ సైఫీ (19) ఇటీవల విడుదలైన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికయ్యారు. సైఫీ తండ్రి రషీద్ అహ్మద్ మార్కెట్లో చిన్న వ్యాపారం నిర్వహించేవారు.

దోపిడీదారులు బలవంతపు వసూళ్లు చేస్తుండటంతో వారికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. వసూళ్లను అడ్డుకోవడంతో దుండగులు ఆయనను కాల్చి చంపేశారు. ఈ ఘటన 1992లో జరిగింది.
అప్పుడు అంజుమ్ వయస్సు నాలుగేళ్లు. నువ్వు జడ్జివి కావాలని తండ్రి రషీద్ ఆమెకు చెప్పేవారు. తన తండ్రి మాటలను గుర్తు పెట్టుకున్న ఆమె అందుకోసం శ్రమించారు. అంజుమ్ తల్లి, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసమే తన భర్త హత్య కేసును వెనక్కి తీసుకున్నట్లు అంజుమ్ తల్లి చెప్పారు.












Click it and Unblock the Notifications