వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25 ఏళ్ల తర్వాత తండ్రి కోరిక నెరవేర్చిన యూపీ అమ్మాయి

ఉత్తర ప్రదేశ్‌లో ఓ యువతి తన తండ్రి చనిపోయిన 25 ఏళ్ల తర్వాత అతని కోరికను నెరవేర్చింది. జడ్జి కావాలని చిన్నతనంలో తన తండ్రి చెప్పిన మాటలను ఆమె గుర్తుంచుకుంది. పాతిక సంవత్సరాల తర్వాత ఆయన కలను నెరవేర్చింద

|
Google Oneindia TeluguNews

ముజఫర్ నగర్: ఉత్తర ప్రదేశ్‌లో ఓ యువతి తన తండ్రి చనిపోయిన 25 ఏళ్ల తర్వాత అతని కోరికను నెరవేర్చింది. జడ్జి కావాలని చిన్నతనంలో తన తండ్రి చెప్పిన మాటలను ఆమె గుర్తుంచుకుంది. పాతిక సంవత్సరాల తర్వాత ఆయన కలను నెరవేర్చింది.

ముజఫర్ నగర్‌కు చెందిన అంజుమ్ సైఫీ (19) ఇటీవల విడుదలైన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికయ్యారు. సైఫీ తండ్రి రషీద్ అహ్మద్ మార్కెట్లో చిన్న వ్యాపారం నిర్వహించేవారు.

25 years after dad killed by goons, girl fulfills his last wish to become judge

దోపిడీదారులు బలవంతపు వసూళ్లు చేస్తుండటంతో వారికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. వసూళ్లను అడ్డుకోవడంతో దుండగులు ఆయనను కాల్చి చంపేశారు. ఈ ఘటన 1992లో జరిగింది.

అప్పుడు అంజుమ్ వయస్సు నాలుగేళ్లు. నువ్వు జడ్జివి కావాలని తండ్రి రషీద్ ఆమెకు చెప్పేవారు. తన తండ్రి మాటలను గుర్తు పెట్టుకున్న ఆమె అందుకోసం శ్రమించారు. అంజుమ్ తల్లి, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసమే తన భర్త హత్య కేసును వెనక్కి తీసుకున్నట్లు అంజుమ్ తల్లి చెప్పారు.

English summary
Anjum Saifi was just four when her father's bullet-riddled body was brought home. That was in 1992. Her father Rasheed Ahmad had stood up against extortionists in a market where his hardware shop was and had even led a protest seeking police protection. One day while the goons were trying to extract money from a hawker, Ahmad once again stood up. He was gunned down in broad daylight. Anjum has a faint memory of how her father used to ask her to become a judge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X