వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

26/11 దాడి లష్కరే తొయిబా కుట్రే: డేవిడ్ హెడ్లీ

|
Google Oneindia TeluguNews

ముంబై: 26/11 ముంబై దాడుల కుట్రలో లష్కరే -ఎ-తొయిబా పాత్ర ఉన్నట్లు పాకిస్థాన్ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్‌ హెడ్లీ వెల్లడించాడు. ముంబై దాడుల కేసులో నిందితుడైన హెడ్లీని ముంబై న్యాయస్థానం సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది.

2006లో తన పేరును దావూద్‌ గిలానీకి బదులుగా డేవిడ్‌ హెడ్లీగా మార్చుకున్నట్లు చెప్పాడు. పాక్‌ నుంచి ఏడుసార్లు, యూఈఏ నుంచి ఒకసారి భారత్‌ వచ్చినట్లు వెల్లడించాడు. దాడులు జరిగిన తర్వాత 2009లోనూ భారత్‌కు వచ్చినట్లు చెప్పాడు.

ముంబై పేలుళ్లకు కుట్ర పన్నింది పాకిస్థాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అని హెడ్లీ తెలిపాడు. పాకిస్థాన్ నుంచే పేలుళ్లకు కుట్ర జరిగిందని చెప్పాడు. హఫీజ్ ప్రసంగాలకు ప్రభావితమై తాను లష్కరే తొయిబా ఉగ్రవాదిగా మారినట్లు హెడ్లీ తెలిపాడు.

26/11 attacks: I was a true follower of Lashkar, David Headley says

తనను క్షమిస్తే అప్రూవర్‌గా మారతానని గత డిసెంబర్‌ 10న భారత న్యాయస్థానాన్ని హెడ్లీ కోరాడు. దీనికి ప్రత్యేక న్యాయమూర్తి సనాప్‌ కొన్ని షరతులపై అంగీకరించారు. ప్రస్తుతం హెడ్లీ అమెరికా న్యాయస్థానంలో 35ఏళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.

కాగా, సౌదీ అరేబియాకు చెందిన హిందీ ట్యూటర్ అబు జిందాల్, మరో పదిమంది ఉగ్రవాదులు ముంబైలో ఈ దాడులకు పాల్పడ్డారు.

English summary
One of the main conspirators in the 26/11 Mumbai terror attacks, American national David Coleman Headley, on Monday deposed as a witness in the case and admitted that he had come to the city with a false identity at the behest of his colleague and handler, Sajid Mir, a Lashkar-e-Taiba (LeT) operative. Mir, allegedly a Pakistani national, is also an accused in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X