వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ వల్ల లాభం లేదు, వెళ్లిపోండి: పాక్ మంత్రిని తిప్పి పంపించిన ప్రణబ్

26/11 తీవ్రవాద దాడులు జరిగిన విషయం తెలిసిన వెంటనే ఆ రోజు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహ్మూద్ ఖురేషికి దిమ్మతిరిగే షాకిచ్చారట.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 26/11 తీవ్రవాద దాడులు జరిగిన విషయం తెలిసిన వెంటనే ఆ రోజు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహ్మూద్ ఖురేషికి దిమ్మతిరిగే షాకిచ్చారట.

ప్రెస్ మీట్ నుంచి వెంటనే పంపించడంతో పాటు ఈ దేశం (భారత్) వదిలి వెళ్లమని ఘాటుగా చెప్పారు. 26/11 ముంబై దాడి అంటే భారతీయుల రక్తం ఉడికిపోతుంది. ఈ దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

ముంబై దాడుల సమయంలో పాక్ మంత్రికి ప్రణబ్ ఇలా

ముంబై దాడుల సమయంలో పాక్ మంత్రికి ప్రణబ్ ఇలా

ఆ సమయంలో పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మహ్మూద్ ఖురేషీ భారత్‍‌లో పర్యటిస్తున్నారు. తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆయనను భారత్ కోరింది. ఈ విషయాన్ని నాడు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ప్రణబ్‌ ముఖర్జీ స్వయంగా వెల్లడించారు.

పుస్తకంలో పేర్కొన్న ప్రణబ్

పుస్తకంలో పేర్కొన్న ప్రణబ్

ప్రణబ్ తన ఆటోబయోగ్రఫీలోని మూడో వాల్యూమ్‌ అయిన 'ది కొలీషన్‌ ఇయర్స్‌ 1996-2012' అనే పుస్తకంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. దీనిని ఇటీవలే విడుదల చేశారు.

ప్రెస్ మీట్ రద్దు చేయించి, పాక్‌కు తిప్పి పంపాలని ప్రణబ్

ప్రెస్ మీట్ రద్దు చేయించి, పాక్‌కు తిప్పి పంపాలని ప్రణబ్

ఖురేషి పర్యటనలో రెండో రోజు ప్రెస్‌ మీట్‌ జరగనున్నట్లు ప్రణబ్‌కు తెలిసింది. అప్పటికే ముంబై దాడులపై దేశం మొత్తం రగిలిపోతోంది. దీంతో ప్రెస్‌మీట్‌ను రద్దు చేయించి ఖురేషిని పాకిస్తాన్‌కు తిప్పి పంపాలని ప్రణబ్‌ నిర్ణయించుకున్నారు.

మీ పర్యటన వల్ల లాభం లేదు, వెళ్లిపోండి

మీ పర్యటన వల్ల లాభం లేదు, వెళ్లిపోండి


వెంటనే ఆయన ఖురేషితో ఫోన్‌లో మాట్లాడారు. మిస్టర్‌ మినిస్టర్‌ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఇక్కడ పర్యటించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, మిమ్మల్ని స్వదేశానికి చేర్చటానికి మా అధికారిక విమానం సిద్ధంగా ఉందని, వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ప్రణబ్‌కు కృతజ్ఞతలు

ప్రణబ్‌కు కృతజ్ఞతలు

దీనిపై కాసేపటికి పాకిస్తాన్ రాయబారి.. ప్రణబ్‌కు ఫోన్‌ చేసి ఖురేషీ కృతజ్ఞతలు చెప్పమన్నట్లు తెలిపారు. ఖురేషీని తీసుకు వెళ్లడానికి పాకిస్తాన్ వాయుసేన విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

జర్నలిస్ట్ సాయం తీసుకున్న ప్రణబ్

జర్నలిస్ట్ సాయం తీసుకున్న ప్రణబ్

పాకిస్తాన్ మంత్రి ఖురేషీని సంప్రదించేందుకు ప్రణబ్‌ అప్పట్లో ఓ జర్నలిస్టు సాయం తీసుకున్నారు. ఖురేషీ నిర్వహించబోయే ప్రెస్‌మీట్‌కు హాజరుకానున్న ఓ జర్నలిస్టుకు ఫోన్‌చేసి ఖురేషితో మాట్లాడించాల్సిందిగా కోరారు. దీంతో సదరు జర్నలిస్టు ఖురేషికి సమాచారం చేరవేశాడు. దీంతో ఖురేషి ప్రణబ్‌కు ఫోన్‌ చేశారు.

శివరాజ్ పాటిల్‌పై చిద్దూ ఆగ్రహం

శివరాజ్ పాటిల్‌పై చిద్దూ ఆగ్రహం

ముంబై దాడుల అనంతరం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ మీటింగ్‌లో నాటి హోంశాఖ మంత్రి శివరాజ్‌ పాటిల్‌ పనితీరుపై చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత శివరాజ్‌ పాటిల్‌ రాజీనామా చేసినట్లు మన్మోహన్‌ నుంచి ప్రణబ్‌కు సమాచారం అందింది. అనంతరం హోంశాఖ బాధ్యతలను చిదంబరానికి అప్పగించారు.

English summary
Former president Pranab Mukherjee had called visiting Pakistani foreign minister Shah Mehmood Qureshi out of a press conference just after the 26/11 terror attack in Mumbai and told him to return to his country immediately. Mukherjee, who was then the external affairs minister, made this revelation in his new book, the third volume of his autobiography, The Coalition Years, 1996-2012, which was launched on Friday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X