వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై పేలుళ్లలో పాక్ హస్తం రుజువు: పాకిస్తాన్ మాజీ అధికారి సంచలనం

2008 ముంబై పేలుళ్లలో పాకిస్తాన్ హస్తం ఉన్నట్లుగా రుజువు అయింది. ఈ మేరకు పాకిస్తాన్ ఎన్ఎస్ఏ మాజీ అధికారి ముహ్ముద్ అలీ దురానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో ఉన్న గ్రూప్ ఈ దాడులకు పాల్పడిందని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: 2008 ముంబై పేలుళ్లలో పాకిస్తాన్ హస్తం ఉన్నట్లుగా రుజువు అయింది. ఈ మేరకు పాకిస్తాన్ ఎన్ఎస్ఏ మాజీ అధికారి ముహ్ముద్ అలీ దురానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో ఉన్న గ్రూప్ ఈ దాడులకు పాల్పడిందని చెప్పారు.

పాక్ నుంచే కుట్ర

పాక్ నుంచే కుట్ర

పాకిస్తాన్ నుంచే పేలుళ్లకు కుట్ర జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని దురానీ స్వయంగా అంగీకరించారు. ముంబై పేలుళ్లు జరిగినప్పుడు దురానీ.. ఐఎస్ఐ జనరల్, పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా పని చేశారు. అప్పుడు మాత్రం ఈ పేలుళ్లతో ఐఎస్ఐ, పాక్‌కు సంబంధం లేదని చెప్పారు.

పాక్‌కు మాత్రం సంబంధం లేదు

పాక్‌కు మాత్రం సంబంధం లేదు

తాజాగా, ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లోని టెర్రర్ గ్రూప్ ఈ దాడులకు పాల్పడిందని అతను చెప్పారు. అదే సమయంలో ఈ దాడులలో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

సయీద్ పైన ఆగ్రహం

సయీద్ పైన ఆగ్రహం

దురానీ.. ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనలైసిస్‌లో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ పైన ఆయన నిప్పులు చెరిగారు. సయీద్‌కు వ్యతిరేకంగా తాము చర్యలు చేపడతామని చెప్పారు.

మళ్లీ విచారణకు భారత్ ఇటీవలే డిమాండ్

మళ్లీ విచారణకు భారత్ ఇటీవలే డిమాండ్

2008 ముంబై దాడుల కేసుపై మరోసారి విచారణ జరపాలని పాకిస్తాన్‌ను భారత్ గత నెల కోరింది. అలాగే, లాహోర్‌లో హౌస్ అరెస్ట్ చేయబడిన హఫీజ్ సయీద్ పైన తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కింద విచారణ జరిపించాలని కూడా భారత్ కోరింది. ఇందుకు భారత్ 24 మంది సాక్షులకు చెందిన రికార్డులను పంపింది.

English summary
Former Pakistan National Security Adviser Mahmud Ali Durrani has admitted that 2008 Mumbai terror attacks were carried out by a terror group based in Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X