వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

26/11 ఉగ్రదాడి నా జీవితాన్ని మార్చేసింది: రతన్ టాటా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

వడోదర: ముంబైలో 26/11 నాడు జరిగిన ఉగ్రదాడి తన జీవితాన్నే మార్చేసిందని టాటా ట్రస్టీ ఛైర్మన్ రతన్ టాటా చెప్పారు. బరోడా మేనేజ్ మెంట్ అసోసియేషన్ (బీఎంఏ)కు చెందిన సాయాజీ రత్న అవార్డును అందుకున్న తర్వాత యువతతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

"నా జీవితాన్ని వెనక్కి తిప్పితే, ముంబైలో జరిగిన ఉగ్రదాడి నా జీవితాన్ని మార్చాయని కచ్చితంగా చెప్పగలను. ఆ ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దాడి జరిగిన ఆరు నెలల వరకు నా గొంతు మూగబోయింది. ఇప్పుడు మాట్లాడుతున్న విధంగా అప్పుడు మాట్లాడలేక పోయా" అని అన్నారు.

26/11 terrorist attack a life-changing moment for me: Ratan Tata

"ప్రతి సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని కలిశా. దాడి జరిగిన మూడు రోజుల వరకు కూడా వాళ్లు ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని స్థితిని చూశాను. ఆ తర్వాత బాధితులను ఆదుకోవడానికి, పునరావాసం కల్పించడానికి ఒక ట్రస్టును ఏర్పాటు చేశాం" అంటూ అప్పటి విషాద సంఘటనను గుర్తు చేసుకున్నారు.

ప్రధాని నరేంద్రమోడీతో తాను గాలి పటాలను ఎగురవేసిన సందర్భాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. గుజరాత్‌కు టాటా నానో ప్రాజెక్టును మోడీ ఆహ్వానించడంపై కూడా స్పందించారు. టాటా నానో ప్రాజెక్టు కోసం మూడు రోజుల్లో భూ సమీకరణ చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు.

సాయాజీ రత్న అవార్డు అందుకున్న ప్రముఖుల్లో రతన్ టాటా రెండో వాడు. మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III పేరు మీద బరోడా మేనేజ్ మెంట్ అసోసియేషన్ 2013లో ఈ అవార్డుని స్థాపించింది. 2013లో ఈ అవార్డుని ఇన్ఫోసిస్ ఫౌండర్స్‌లలో ఒకరైన ఎన్ఆర్ నారాయణ మూర్తి అందుకున్నారు.

English summary
The 26/11 terrorist attack in Mumbai was the life changing moment in my life, Ratan Tata, chairman of Tata Trusts, said here on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X