26/11 ముంబై బాంబు పేలుళ్ళ మాస్టర్ మైండ్ ఆచూకీ కోసం ... యూఎస్ 5 మిలియన్ డాలర్ల భారీ రివార్డు
ముంబైలో టెర్రరిస్టులు మారణహోమం సృష్టించిన 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అమెరికా ఆ గాయాలను మరిచిపోలేదు. ముంబై టెర్రరిస్టుల మారణహోమంలో యూఎస్ కు చెందిన ఆరుగురు మృతి చెందడంతో, అప్పటినుండి ఇప్పటివరకు ఆ గాయాలు మర్చిపోలేదని, టెర్రరిస్టుల పై పోరాటానికి అమెరికా భారత్ తో కలిసి ముందుకు సాగటానికి నేటికీ సిద్ధంగా ఉన్నామని తాజాగా ప్రకటించింది. ఇదే సమయంలో నవంబర్ 26వ తేదీన ముంబై మారణహోమానికి ప్రధాన సూత్రధారి అయిన లష్కరే తోయిబాకు చెందిన సాజిద్ మీర్ తలపై అమెరికా భారీ రివార్డును ప్రకటించింది.
26/11..ఉగ్రవాదంపై భారత్ తో కలిసి యూఎస్ పోరాటం..అమరుల స్మారక సభలో యూఎస్ వెల్లడి

లష్కరే తోయిబా సభ్యుడు సాజిద్ మీర్ ఆచూకీ చెప్తే భారీ రివార్డ్
2008 నవంబర్ 26వ తేదీన జరిగిన దారుణ మారణ హోమానికి బాధ్యులైన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా యొక్క సీనియర్ సభ్యుడు సాజిద్ మీర్ ను పట్టుకున్నా , ఆచూకీ తెలిపిన వారికి ఐదు మిలియన్ డాలర్లను అందజేస్తామని ప్రకటించింది . మారణహోమం జరిగి 12 సంవత్సరాలు అయినా అతనిని ఇప్పటివరకు పట్టుకోలేని కారణంగా యూఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. యూఎస్ రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రాం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఏ దేశంలోనైనా అతనిని అరెస్టు చేసినా, లేదా అతనిని శిక్షించిన సరైన సమాచారం ఇచ్చినా , వారికి ఐదు మిలియన్ డాలర్ల వరకు రివార్డు ఇస్తామని ప్రకటించారు.

ఎఫ్బిఐ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలోసాజిద్ మీర్
మీర్ ఎఫ్బిఐ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నాడని పేర్కొన్నారు.
నవంబర్ 26, 2008 న, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న 10 మంది ఉగ్రవాదులు ముంబైలో 12 ప్రాంతాలలో మారణహోమం సృష్టించాయి. తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ (చాబాద్ ) ఇల్లు, మరియు ఛత్రపతి శివాజీ టెర్మినస్ లతోపాటు వివిధ ప్రాంతాలలో చేసిన దాడులలో 166 మంది మరణించారు. ఈ దాడులలో తొమ్మిది మంది ఉగ్రవాదులు మరణించారు. ప్రాణాలతో బయటపడిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను పట్టుకుని మరణశిక్ష విధించారు. నవంబర్ 11, 2012 న పూణేలోని యెర్వాడ సెంట్రల్ జైలులో కసబ్‌ను ఉరితీశారు.

ముంబై దాడుల ప్రధాన సూత్రధారి సాజిద్ మీర్
ముంబై దాడులలో సాజిద్ మీర్ ముంబై దాడికి ఎల్టి యొక్క ఆపరేషన్స్ మేనేజర్‌గా ఉన్నారు, దాని ప్రణాళిక, తయారీ మరియు అమలులో ప్రధాన పాత్ర పోషించారు. మీర్ యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్, నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇల్లినాయిస్, ఈస్టర్న్ డివిజన్ (చికాగో, ఇల్లినాయిస్) లో ఏప్రిల్ 21 న అతనిపై అభియోగాలు మోపారు అని, నేరారోపణ ప్రకారం, దాడుల సమయంలో, బందీలను చంపాలని, తగలబెట్టాలని, గ్రెనేడ్లను విసిరేయాలని మీర్ దాడి చేసినవారికి సలహా ఇచ్చాడని పేర్కొన్నారు.

మీర్ అరెస్టుకు వారెంట్ 2011లోనే .. ఇప్పటివరకు పట్టుబడని ఉగ్రవాది
పట్టుబడిన దాడి చేసిన టెర్రరిస్ట్ అయిన కసబ్ ను విడుదల చేయడానికి బదులుగా బందీని విడుదల చేయాలని కోరాడని పేర్కొన్నారు. మీర్ అరెస్టుకు వారెంట్ ఏప్రిల్ 22, 2011 న జారీ చేయబడింది. అయినప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకూ అతన్ని పట్టుకోలేకపోయారు. ఈ కారణంగానే ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన సాజిద్ మీర్ ఆచూకీ తెలిపిన వారికి ఐదు మిలియన్ డాలర్ల రివార్డు అందజేస్తామని ప్రకటించింది యూఎస్ .