వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రైవేట్ ట్రావెల్స్‌లో పాటల హోరు, 26 బస్సులకు చలాన్లు విధించిన ఆర్టీఏ, ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

ప్రైవేట్ ట్రావెల్స్‌కు అద్దు అదుపూ లేకుండా పోతోంది. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళతారు. నంబర్ ప్లేట్ కూడా ఉండదు. కొన్నింటికీ తాత్కలిక నంబర్ ప్లేట్ ఉంటోంది. దీనికితోడు సౌండ్ పెట్టి పాటలతో హోరెత్తించి.. మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తారు. ప్రైవేట్ ట్రావైల్స్ ఆగడాలకు పంజాబ్ రవాణాశాఖ మెల్లగా చెక్ పెడుతూ వస్తోంది.

గన్ కల్చర్‌కు నో

గన్ కల్చర్‌కు నో

ప్రైవేట్ బస్సుల్లో గన్ కల్చర్ ప్రోత్సహించేలా పాటలు పెడుతోన్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణశాఖ అధికారులు కొరఢా ఝలిపించారు. గత రెండురోజుల నుంచి హింసను ప్రేరేపించే సాంగ్స్ పెడుతోన్న 26 బస్సులకు చలాన్లు జారీచేశారు. పంజాబ్ రవాణాశాఖ సూచనల మేరకు చాలన్లు జారీ చేశామని ఆర్టీఏ విభాగ అధిపతి సుఖ్విందర్ కుమార్ తెలిపారు.

ఫస్ట్ టైం రూ.వెయ్యి..

ఫస్ట్ టైం రూ.వెయ్యి..

మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం 192 (2) సెక్టార్ ప్రకారం ప్రైవేట్ వాహనాలను చలాన్లు జారీచేశామని చెప్పారు. రోడ్డు భద్రత, వాయు కాలుష్యం పెంచినందుకు చర్యలు తీసుకున్నామని సుఖ్విందర్ కుమార్ వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం మొదటిసారి రూ.వెయ్యి జరిమానా విధిస్తామని.. రెండోసారి కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.2 వేల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.

ఓవర్ లోడ్..

ఓవర్ లోడ్..

అంతేకాదు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళితే కూడా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. గతనెలలో ఓవర్ లోడ్ వాహనాల నుంచి రూ.76 లక్షలను చలాన్లా రూపంలో వసూల్ చేశామని చెప్పారు. అందులో చాలా వాహనాలు పన్ను కూడా కట్టలేదని వివరించారు.

టెంపరరీ నంబర్ ప్లేట్స్..

టెంపరరీ నంబర్ ప్లేట్స్..

96 వాహనాలు తాత్కాలిక నంబర్లతో నడపడంతో చలాన్లు విధించామని స్పష్టంచేశారు. నిర్దేశించిన సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకోనందుకు చలాన్లు తప్పలేదని చెప్పారు. వీలైనంత త్వరగా ఆర్సీ నంబర్ తీసుకోవాలని, లేదంటే చలాన్ల మోత తప్పదని స్పష్టంచేశారు.

English summary
The Regional Transport Authority, Mohali, has challaned 26 buses of private transporters for playing “loud and lewd songs, which promote gun culture” as part of a drive over the past two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X