వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: యువకుడి కడుపులో నుండి కిలో ఇనుప ముక్కలు, రూ. 790 నాణెలు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలోని ఓ యువకుడి కడుపులో నుండి 263 నాణెలను, సూదులను వైద్యులు తొలగించారు. సుమారు. రూ.790 విలువైన నాణెలు ఆ యువకుడి కడుపు నుండి తొలగించారు వైద్యులు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలోని ఓ యువకుడి కడుపులో నుండి 263 నాణెలను, సూదులను వైద్యులు తొలగించారు. సుమారు. రూ.790 విలువైన నాణెలు ఆ యువకుడి కడుపు నుండి తొలగించారు వైద్యులు.

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. చిన్నతనంలో కొందరు బలపాలు తింటుంటారు. మరికొందరు సున్నం తింటారు. అయితే పెద్దయ్యాక కూడ కొందరు ఈ అలవాట్లను మార్చుకోరు.

అయితే ఎవరు చూడకుండా ఈ అలవాట్లను కొనసాగిస్తారు. కొందరైతే బహిరంగంగానే తమ చిన్ననాటి నుండి కొనసాగిస్తున్న అలవాట్లను అదే తరహలో పాటిస్తుంటారు.అయితే ఈ తరహ అలవాట్లు కొన్ని సమయాల్లో ప్రాణాలకు ముప్పు తెచ్చే ఘటనలు కూడ లేకపోలేదు.

 యువకుడి కడుపులో నుండి 263 నాణెలు తీసివేత

యువకుడి కడుపులో నుండి 263 నాణెలు తీసివేత

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా ఆసుపత్రిలో ఒక యువకుడి కడపులోంచి 263 నాణెలను వెలికితీశారు. అయితే ఈ నాణెల విలువ సుమారు. 790 రూపాయాలుగా గుర్తించారు. రూ. 2, రూ. 5, రూ. 10 నాణేలు అందులో ఉన్నాయని వైద్యులు చెప్పారు.

 కిలో బరువున్న ఇనుపముక్కలు, సూదులు

కిలో బరువున్న ఇనుపముక్కలు, సూదులు

ఈ యువకుడి కడుపు నుండి కేజీ బరువున్న ఇనుప పదార్థాలను వైద్యులు తొలగించారు. అంతేకాదు సూదులను కూడ తొలగించారు. కడుపులో నాణెలు, ఇనుపముక్కలు, సూదులు నిండిపోయాయి. ఇనుప ముక్కల బరువే సుమారు కిలో వరకు ఉంటుందని వైద్యులు గుర్తించారు.సైకిల్‌ చైన్‌ ముక్కలు, సూదులు, గోర్లు.. ఉన్నాయని వైద్యులు చెప్పారు.

 అస్వస్థతకు గురైన బాధితుడు

అస్వస్థతకు గురైన బాధితుడు

కడుపులో వ్యర్థాలు భారీగా పేరుకుపోవడంతో.. సదరు యువకుడు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు బాధితుడు. అయితే పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.

3 గంటల పాటు ఆపరేషన్

3 గంటల పాటు ఆపరేషన్

మూడు గంటలపాటు బాధితుడికి ఆపరేషన్ నిర్వహించి వైద్యులు అతడి కడుపులో ఉన్న వ్యర్థాలను తొలగించారు. శస్త్రచికిత్స తర్వాత ఆయన కోలుకొంటున్నాడని వైద్యులు ప్రకటించారు. మరో వైపు ఇదే తరహలో నెల రోజుల క్రితం కోల్‌కత్తాలో 48 ఏళ్ వ్యక్తి కడుపులో నుండి సుమారు కిలో బరువున్న గోళ్ళను వెలికితీశారు.

English summary
As many as 263 coins worth ₹790 were removed from a youth's stomach during a three-hour operation at a government hospital in Madhya Pradesh's Rewa, doctors said. Nails, needles, and broken iron chains collectively weighing almost one kilogram were also removed from the patient's stomach. Doctors said that the articles retrieved from his body appeared to be six months old.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X