వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనికా కపూర్ కరోనా కలకలం: ఆమెను కలిసిన 266 మందికి పరీక్షలు, ఊపిరిపీల్చుకున్నారు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవల లండన్ వెళ్లివచ్చిన విషయాన్ని దాచిపెట్టి రాజకీయ, బాలీవుడ్ ప్రముఖులకు పార్టీ ఇచ్చిన సింగర్ కనికా కపూర్ పెను దుమారమే సృష్టించింది. ఎందుకంటే ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడమే ఇందుకు కారణం. దీంతో ఆమెతో పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీలందరూ ఆందోళన చెందారు.

266 మందికీ నెగిటివ్..

266 మందికీ నెగిటివ్..

ఈ నేపథ్యంలో కనకా కపూర్ ఇచ్చిన పార్టీలో పాల్గొన్నవారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే, ఆమెను కలిసిన 266 మంది ప్రముఖులకు కూడా కరోనా నెగిటివ్ వచ్చిందని ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 60కిపైగా నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా వారందరికీ నెగిటివ్ అని తేలందని చెప్పారు.

కనికా పార్టీలో ప్రముఖులు..

కనికా పార్టీలో ప్రముఖులు..


కాగా, కనికా కపూర్ పార్టీలో పాల్గొన్న వారిలో రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు, ఎంపీ, దుష్యంత్ సింగ్, యూపీ మంత్రి జైప్రతాప్ సింగ్, మాజీ కేంద్రమంత్రి జతిన్ ప్రసాద్, ఆయన భార్య నేహా పాల్గొన్నారు. ఇక కనికా కపూర్ ఎవరెవరిని కలిశారో వారందరినీ గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నామని యూపీ సర్వేలెన్స్ అధికారి వికసేందు అగర్వాల్ తెలిపారు. కనికా కపూర్ పార్టీలో పాల్గొన్నవారందరికీ నెగిటివ్ రావడం మంచి విషయమని అన్నారు.

నెగిటివ్ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు..

నెగిటివ్ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు..


అయితే, కనికా కపూర్ పార్టీలో పాల్గొన్నవారంతా ఆ తర్వాత వివిధ వ్యక్తులను కలవడం గమనార్హం. వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్, టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన కూడా సెల్ప్ క్వారంటైన్ లో ఉన్నారు. అయితే, దుష్యంత్ అంతకుముందు పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ కు వెళ్లి పలు కార్యక్రమాల్లో వివిధ వ్యక్తులను కలిశారు. దీంతో వారంతా ఆందోళన చెందారు. ఇప్పుడు పరీక్షల్లో పార్టీలో పాల్గొన్నవారందరికీ నెగిటివ్ రావడంతో వీరితోపాటు వారంతా ఊపిరిపీల్చుకున్నారు.

కనికా కపూర్‌పై కేసు.. రోగివేనంటూ డాక్టర్ల ఆగ్రహం

కనికా కపూర్‌పై కేసు.. రోగివేనంటూ డాక్టర్ల ఆగ్రహం

విదేశాల నుంచి వచ్చిన విషయాన్ని దాచి పార్టీని నిర్వహించడం, ఇంతమందికీ ప్రాణాంతక వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నా.. నిర్లక్ష్యం వ్యవహరించిన నేపథ్యంలో కనికా కపూర్‌పై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కరోనా బాధితురాలైన కనికా కపూర్ పై ఆమెకు వైద్యం అందించిన డాక్టర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాధిగ్రస్తురాలిగా ఉండకుండా.. ఆస్పత్రిలోనూ సెలబ్రిటీలా వ్యవహరించడంపై వారు మండిపడ్డారు. ఆస్పత్రుల్లో రోగులే ఉంటారు.. సెలబ్రిటీలుండరని ఘాటుగా వ్యాఖ్యానించారు. కనికా కపూర్ తల్లికి కూడా అనుమానిత లక్షణాలుండటంతో ఆ కుటుంబంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో తమను అంతా నీచంగా చూస్తున్నారని కనికా కపూర్ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వారి కుటుంబంపై ఇలాంటి విమర్శలు వస్తుండటం గమనార్హం.

English summary
266 contacts of Kanika Kapoor traced, all samples tested negative: Govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X