వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్మనాభస్వామి ఆలయంలో 266కిలోల బంగారం మాయం: సుప్రీంకు నివేదిక

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువనంతపురం శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుంచి 266 కిలోల బంగారం మాయమైంది. సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆడిటింగ్ నివేదికలో మాజీ కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) వినోద్‌రాయ్ ఈ విషయం తెలిపారు.

ఆలయంలోని 893 కిలోల బంగారాన్ని వివిధ కార్యక్రమాల నిమిత్తం బయటకు తీసుకెళ్లగా, తిరిగి 627 కిలోల బంగారం మాత్రమే దేవస్థానానికి చేరుకుందని వినోద్‌రాయ్ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఆలయంలోని బంగారంపై సంబంధిత రికార్డులను తనిఖీచేసి ఆడిటింగ్ నివేదిక సమర్పించాలని వినోద్‌రాయ్‌ను నిరుడు ఏప్రిల్‌లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.

‘266 kg of gold lost from Padmanabhaswamy temple’

వినోద్ రాయ్ నివేదికతో బంగారం మాయం కావడానికి కారణమైన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని సిపిఎం ఎమ్మెల్యే వి శివకుట్టి వ్యాఖ్యానించారు. కాగా, దేవాలయ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ట్రావెల్‌కోర్ రాజ కుటుంబం రాయ్ నివేదికపై స్పందించలేదు.

దేవస్థానం పనితీరును పూర్తిగా ప్రక్షాళన చేయాలని న్యాయస్థానానికి సహాయకుడిగా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం సిఫార్సుమేరకు జస్టిస్ ఆర్‌ఎం లోధా, జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని ధర్మాసనం నిరుడు ఏప్రిల్‌లో అడిటింగ్ నిర్వహించాలని వినోద్‌రాయ్‌ను ఆదేశించింది.

English summary
The audit report prepared by the former Comptroller and Auditor General of India Vinod Rai on the Sree Padmanabhaswamy temple in Kerala shows that huge quantities of gold were lost when it was outside for purification work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X