వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యక్తి ఇంట్లో 27 పుర్రెలు స్వాధీనం: దర్యాప్తు

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని ఓ వ్యక్తి ఇంటి నుంచి 27 మానవ పుర్రెలను అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. పూరీ జిల్లాలోని మనోరంజన్ జెనా అనే వ్యక్తి ఇంట్లో పుర్రెలను పెట్టుకొని ఉన్నట్టు స్థానికులు ఎస్‌సీబీ మెడికాలేజ్ సిబ్బందికి సమాచారమందించారు.

దీంతో కాలేజ్ అధికారుల బృందం అతని ఇంట్లో ఉన్న 27 పుర్రెలను స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.

skulls

ముంబైలో ఓఎన్‌జీసీ ఉద్యోగి ఐన మనోరంజన్ ఇంట్లో పుర్రెలకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు దొరకలేదని అధికారుల బృందం తెలిపింది. స్థానికులు మాత్రం మంత్రాలు చేసేందుకే పుర్రెలను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంటూ ఆరోపణలు చేస్తున్నారు.

ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు, మనోరంజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారించిన అనంతరం అతడ్ని విడిచిపెట్టారు. అన్ని పుర్రెలు ఎలా వచ్చాయనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

మహారాష్ట్రలోని పుణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసులున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

English summary
As many as 27 apparently human skulls recovered from a house in the holy town of Puri will be examined by a four-member team at SCB Medical College Hospital in Cuttack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X