వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ మత ప్రార్థనల కోసం వచ్చి.. మసీదుల్లో మకాం వేసిన విదేశీయులు: జాయింట్ సెర్చ్ ఆపరేషన్.. !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌పై ఢిల్లీ మత ప్రార్థనల ప్రభావం తీవ్రంగా పడింది. ఈ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారి వల్ల దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇదే ప్రార్థనల్లో పాల్గొనడానికి విదేశాల నుంచి వచ్చిన వారు తమ స్వస్థలాలకు వెళ్లే వీలు లేకుండా ఉత్తర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మకాం వేశారు. మసీదుల్లో తలదాచుకుంటున్నారు.

హైదరాబాద్ తరహాలో: ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లిన డాక్టర్లపై రాళ్లతో దాడిహైదరాబాద్ తరహాలో: ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లిన డాక్టర్లపై రాళ్లతో దాడి

యూపీ మసీదుల్లో తలదాచుకున్న విదేశీయులు

యూపీ మసీదుల్లో తలదాచుకున్న విదేశీయులు

ఇదివరకే అదుపులోకి తీసుకున్న విదేశీయులు, మర్కజ్ మసీదు భవనంలో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా వారి కోసం ఢిల్లీ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ అధికారులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి వరకూ ఈ ఆపరేషన్ కొనసాగింది. వారిలో చాలామంది ఉత్తర ప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో మసీదుల్లో తలదాచుకున్నట్లు నిర్ధారించారు. 273 మందిని గుర్తించారు. వారిని క్వారంటైన్లకు పంపించారు.

 ఇండోనేషియన్లే అధికం..

ఇండోనేషియన్లే అధికం..

ఇప్పటిదాకా చేపట్టిన జాయింట్ సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఇండోనేషియన్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 172 మంది ఇండోనేషియన్లు ఉన్నట్లు ఢిల్లీ పోలసులు వెల్లడించారు. కిర్గిజ్‌స్తాన్ నుంచి 36 మంది, బంగ్లాదేశ్ నుంచి 21 మంది మార్చి మొదటివారంలోనే ఢిల్లీకి చేరుకున్నట్లుగా తెలిపారు. మరింత మంది ఉండొచ్చనే అనుమానంతో జాయింట్ సెర్చ్ ఆపరేషన్‌ను ఇంకా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. వారందర్నీ క్వారంటైన్లకు తరలించినట్లు చెప్పారు.

మత పెద్దలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన యూపీ పోలీసులు

మత పెద్దలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన యూపీ పోలీసులు

పోలీసులకు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండా మసీదుల్లో తలదాచుకోవడానికి అనుమతి ఇచ్చిన పలువురు మత పెద్దలపై కేసులు నమోదు చేసినట్లు లక్నో నగర పోలీసు కమిషనర్ వెల్లడించారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వారిపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశామని తెలిపారు. పర్యాటక విసాతో వచ్చిన వారంతా మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్నారని తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. విసా నిబంధనల ప్రకారం.. మత ప్రార్థనల్లో పాల్గొనడం నేరమని తెలిపారు.

Recommended Video

14 Positive Cases in AP's West Godavari District Linked With Markaz Prayers | People Quarantined
ఆగ్రా సమీపంలోని రిసార్టులో..

ఆగ్రా సమీపంలోని రిసార్టులో..

జాయింట్ సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా తాము అదుపులోకి తీసుకున్న 273 మంది విదేశీయులలో 104 మందిని ఆగ్రా సమీపంలోని ఓ రిసార్టులో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించినట్లు ఉత్తర ప్రదేశ్ పోలీసులు తెలిపారు. వారంతా ఆగ్రా వైద్యాధికారుల పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పారు. వారి రక్త పరీక్షలను సేకరించి, కరోనా వైరస్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి పంపించమాని ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ముఖేష్ వత్స్ తెలిపారు.

English summary
Delhi Police: In a joint operation conducted by Crime Branch and Delhi Govt, 275 foreign nationals including 172 from Indonesia, 36 from Kyrgyzstan and 21 from Bangladesh who attended the Tablighi Jamaat congregation at Nizamuddin Markaz in Delhi have been identified and quarantined.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X