ఆ మూడింటిపైనా పెను భారం: థియేటర్లల్లో ఇక తగ్గనున్న స్నాక్స్ రేట్స్

న్యూఢిల్లీ: ఇవ్వాళ దేశ రాజధానిలో సమావేశమైన 50వ జీఎస్టీ కౌన్సిల్.. పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌ ఇక మరింత ప్రియం కానుంది. క్యాసినోలకు వెళ్లే వారికీ బిగ్ షాక్ తగిలింది. ఇక హార్స్ రేసింగ్‌లంటే ఇష్టపడే వారినీ వదల్లేదు. ఈ మూడింటిపైనా జీఎస్టీ మోత మోగించింది.

ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలు, క్యాసినోలపై జీఎస్టీ కంప్లీట్ ఫేస్ వాల్యూ 28 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించారు ఈ కౌన్సిల్ భేటీలో. ఈ మూడింటి మీద 28 శాతం జీఎస్టీని విధించడానికి కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా అంగీకరించారు. అదే సమయంలో- ప్లాట్‌ఫామ్ ఫీజ్ మొత్తంపై 18 శాతం జీఎస్టీని విధించాలంటూ గోవా ప్రభుత్వం సూచించింది. ప్రైజ్ పూల్ కంట్రిబ్యూషన్‌ను పన్నుల నుంచి మినహాయించాలనీ పేర్కొంది.

28 percent GST to be levied on online gaming, horse racing, casinos

డ్రీమ్ 11 ఆన్‌లైన్ గేమింగ్‌నూ దీని పరిధిలోకి తీసుకొచ్చింది జీఎస్టీ కౌన్సిల్. డ్రీమ్ 11కు దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2021- 2022 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 3,841 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది ఈ సంస్థ. దీన్ని 28 శాతం జీఎస్టీ శ్లాబ్ పరిధిలోకి తీసుకుని రావడం వల్ల ఖజానాకు అదనపు ఆదాయం అందుతుంది.

సినిమా టిక్కెట్ల విక్రయం, థియేటర్లల్లో విక్రయించే స్నాక్స్‌పైనా జీఎస్టీ భారం పడింది. పాప్‌కార్న్ లేదా కూల్ డ్రింక్స్.. వంటి చిరు తిండ్లు, ఇతర తినుబండారాలను టికెట్లతో క్లబ్ చేసింది. ఇదివరకు స్నాక్స్‌పై 18 శాతం జీఎస్టీ ఉండగా.. దీన్ని అయిదు శాతం శ్లాబ్ పరిధిలోకి తీసుకొచ్చింది.

ఇంతకుముందు 100 రూపాయల కంటే తక్కువ ఉన్న సినిమా టికెట్లపై 12 శాతం జీఎస్టీ పన్ను ఉండేది. థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ఉన్న వాటిపై 18 శాతం జీఎస్టీ విధించేవారు. ఈ రెండింటినీ క్లబ్ చేసింది జీఎస్టీ కౌన్సిల్. స్నాక్స్‌పై వసూలు చేస్తోన్న 18 శాతం జీఎస్టీని అయిదు శాతం శ్లాబ్‌లోకి తగ్గించింది. దీనివల్ల థియేటర్లల్లో విక్రయించే చిరుతిండి ధరలు తగ్గుతాయి. క్యాన్సర్ మందులపై వసూలు చేస్తోన్న ఇంప్టోర్టెడ్ జీఎస్టీని తొలగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+