వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త, పిల్లల కళ్ల ముందే కారులో మహిళ సజీవదహనం, ఆంధ్రాలో బంధువుల కోసం వెలుతుంటే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వేగంగా వెలుతున్న కారులో ఆకస్మికంగా మంటలు వ్యాపించి కుటుంబ సభ్యుల సమక్షంలో మహిళ సజీవదహనం అయిన ఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని నిర్నా క్రాస్ సమీపంలోని జాతీయ రహదారిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంకు చెందిన కల్యాణి (28) అనే మహిళ కారులో సజీవదహనం కావడంతో ఆమె భర్త, ఇద్దరు పిల్లలు చిన్నచిన్న గాయాలతో ప్రాణాలతో భయటపడ్డారు.

మాజీ ప్రధాని మనుమడి మీద హత్యాయత్నం కేసు, ఎఫ్ఐఆర్, డబ్బుల విషయంలో దాడి ?మాజీ ప్రధాని మనుమడి మీద హత్యాయత్నం కేసు, ఎఫ్ఐఆర్, డబ్బుల విషయంలో దాడి ?

ఆంధ్రప్రదేశ్ లోని మచలీపట్నంకు చెందిన కల్యాణి కుటుంబ సభ్యులు వ్యాపారం నిమిత్తం మహారాష్ట్రలోని నాసిక్ లో స్థిపరడ్డారు. మచిలీపట్నంలోని బంధువులను చూడటానికి కల్యాణి భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో నాసిక్ నుంచి బయలుదేరారు.

 28 year old women was burned to death alive at National Highway 9 at Bidar in Karnataka

మార్గం మధ్యలో గురువారం బీదర్ జిల్లాలోని చిటగుప్పా తాలుకా నిర్నా క్రాస్ సమీపంలోని జాతీయ రహదారిలో వేగంగా వెలుతున్న కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కల్యాణి మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో కల్యాణి కారులో నుంచి బయటకు రాలేకపోయింది.

ఎన్ కౌంటర్ భయం? కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, కోర్టులో లొంగిపోయిన గ్యాంగ్ లీడర్, వీడియోలు!ఎన్ కౌంటర్ భయం? కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, కోర్టులో లొంగిపోయిన గ్యాంగ్ లీడర్, వీడియోలు!

కల్యాణి భర్త, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. కుటుంబ సభ్యులు చూస్తున్న సమయంలోనే కల్యాణి కారులో సజీవ దహనం అయ్యింది. విషయం గుర్తించిన స్థానికులు కారులో మంటలు అదుపు చేసి పోలీసులకు సమాచారం అందించారు. కల్యాణి భర్త, వారి పిల్లలను ఆసుపత్రికి తరలించారు. కారులో షార్ట్ సర్కూట్ వలనే మంటలు వ్యాపించి ఉంటాయని, కల్యాణి భర్తను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Bengaluru: 28 year old women was burned to death alive at National Highway 9 at Bidar, Karnataka after car catches the fire. Police visited the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X