వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జీ కేసు: నాడు జయలలితకు ఎలా కలిసి వచ్చిందంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

2G spectrum scam : 2జీ స్కాం: డీఎంకే సంబరాలు, వీడియో !

చెన్నై: 2జీ కేసు దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో డిఎంకెకు తీరని నష్టాన్ని కల్గించింది. ఈ కేసు రాజకీయంగా జయలలితకు 2 జీ కేసు కలిసివచ్చింది. 2011 ఎన్నికల సమయంలో 2 జీ కేసు తమిళనాడులో డిఎంకెను మట్టికరిపించి అన్నాడిఎంకెకు పట్టం కట్టేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు. 2011 వరకు తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె, కాంగ్రెస్ కూటమి హవాను జయలలిత బద్దలుకొట్టింది.

తమిళనాడు రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో జయలలిత సంచలనం సృష్టించారు. 2016లో వరుసగా రెండో సారి అధికారంలోకి జయలలిత రావడానికి ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కారణమని విశ్లేషకులు చెబుతుంటారు.

రాజకీయాల్లో సంచలనం: ఏమిటీ 2జీ కేసు?రాజకీయాల్లో సంచలనం: ఏమిటీ 2జీ కేసు?

అయితే ఎన్నికలకు దూరంగా ఉంటూ వచ్చిన జయలలిత పార్టీకి 2జీ కేసు రూపంలో ఆయుధం అంది వచ్చింది.ఈ ఆయుధం ఆధారంగా డిఎంకె పార్టీని 2011 ఎన్నికల్లో అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత చావు దెబ్బకొట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.

2011 ఎన్నికల్లో జయకు కలిసొచ్చిన 2జీ కేసు

2011 ఎన్నికల్లో జయకు కలిసొచ్చిన 2జీ కేసు

2011 ఎన్నికల్లో జయలలిత పార్టీ స్వంతంగా అధికారాన్ని కైవసం చేసుకొనే సీట్లను కైవసం చేసుకొంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే 2జీ కేసులో కీలకమైన తీర్పు వెలువడడంతో ఆ కేసు డిఎంకెను తీవ్రంగా నష్టపర్చిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ కేసుతో తనకు కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని డిఎంకె అధినేత కరుణానిధి ఆనాడు ప్రకటించారు. కానీ 2011 ఎన్నికల్లో డిఎంకె చావు దెబ్బతింది. అన్నాడిఎంకెకు తమిళనాడు ప్రజలు 203 సీట్లలో విజయాన్ని అందించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ఓటర్లు కూడ జయ పార్టీకి ఆ సమయంలో పట్టం కట్టారు.2 జీ కేసు ప్రభావం ఆ ఎన్నికల్లో స్పష్టంగా కన్పించిందని విశ్లేషకులు భావిస్తుంటారు.

ఉపఎన్నికలకు దూరంగా జయ

ఉపఎన్నికలకు దూరంగా జయ

ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు 2010లో జయలలిత ప్రకటించారు. 2010 ఆగష్టు 18వ,తేదిన తమిళనాడు రాష్ట్రంలోని 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయిత.అయితే ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆనాడు అన్నాడిఎంకె నిర్ణయం తీసుకొంది.ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేనందున ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆనాడు జయలలిత ప్రకటించారు.కానీ, ఆ తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లోనే జయ పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.ఈ విజయానికి 2జీ కేసు కారణంగా చెబుతుంటారు.

డిఎంకె కాంగ్రెస్ హవాకు 2 జీ కేసు బ్రేక్

డిఎంకె కాంగ్రెస్ హవాకు 2 జీ కేసు బ్రేక్

2009 పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ డిఎంకె కూటమి హవా కొనసాగించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ,డిఎంకె కూటమి 39 పార్లమెంట్ సీట్లలో 29 సీట్లను కైవసం చేసుకొంది. అదే హవా 2010 వరకు కొనసాగింది. 2011 ఎన్నికల్లో కూడ డిఎంకె విజయం సాధించే అవకాశం కూడ ఉందని సర్వేలు తేల్చి చెప్పాయి. అయితే ఎన్నికలకు ముందు రోజు 2 జీ కేసులో వచ్చిన తీర్పు తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసింది.

డిఎంకెను దెబ్బతీసిన జయలలిత

డిఎంకెను దెబ్బతీసిన జయలలిత

2011 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జయలలిత సంక్షేమ పథకాలను తమిళనాడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేసింది. 2011లో డిఎంకె అధికారంలోకి వస్తే స్టాలిన్ పగ్గాలు అందించేవారనే ఆ సమయంలో ప్రచారం సాగింది. కానీ, ఆ ఎన్నికల్లో అన్నాడిఎంకె విజయం సాధించింది. కానీ, 2016 ఎన్నికల సమయంలో సంక్షేమపథకాలే మరోసారి జయలలితను తమిళనాడు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చాయని అంటారు విశ్లేషకులు.

2011లో జయకు భారీగా పెరిగిన సీట్లు

2011లో జయకు భారీగా పెరిగిన సీట్లు

2011 ఎన్నికల్లో జయలలితకు భారీగా సీట్లు పెరిగాయి. ఈ ఎన్నికల్లో 203 స్థానాలను జయపార్టీ కైవసం చేసుకొంది. అంతకుముందు అన్నాడిఎంకెకు కేవలం 73 స్థానాలు మాత్రమే ఉండేవి. కానీ, ఆ ఎన్నికల్లో 203 స్థానాలను కైవసం చేసుకొంది. డిఎంకెకు కేవలం 31 సీట్లు మాత్రమే ఆనాడు దక్కాయి.157 సీట్ల నుండి 31 స్థానాలకు డిఎంకె పడిపోయింది.2016 అన్నాడిఎంకెకు 134 సీట్లు దక్కాయి. డిఎంకె తన బలాన్ని31 నుండి 89కు పెంచుకొంది.

English summary
2g case was effected on DMK in 2011 assembly elections results.DmK was lost its power in the Tamilnadu state in 2011.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X