వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్ష్యం తెస్తారని రోజూ కోర్టుకొచ్చి చూశా: 2జీ కేసులో జడ్జి షాకింగ్ కామెంట్స్, సంతకమేదంటూ ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్కాం కేసులో పాటియాలా సీబీఐ న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఆధారాలు తీసుకు వస్తారని తాము ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నామని, కానీ ఒక్క ఆధారం తేలేకపోయారని వ్యాఖ్యానించారు.

Recommended Video

2G spectrum scam : 2జీ స్కాం: డీఎంకే సంబరాలు, వీడియో !

ఆసక్తికరం: లాయర్‌నే పెట్టుకోని రాజా, 2జీ తీర్పుపై కరుణానిధి చెప్పలేక రాశాడు!ఆసక్తికరం: లాయర్‌నే పెట్టుకోని రాజా, 2జీ తీర్పుపై కరుణానిధి చెప్పలేక రాశాడు!

2జీ కేసులో కేంద్ర మాజీ మంత్రి రాజా, ఎంపీ కనిమొళి తదితరులకు గురువారం కోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీబీఐ జడ్జి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ కేసులో అందరిని నిర్దోషులుగా విడుదల చేశారు.

2జీ స్కాంపై మన్మోహన్ ఇలా, అలాగే చేయండి.. స్వీట్లు పంచిన స్టాలిన్2జీ స్కాంపై మన్మోహన్ ఇలా, అలాగే చేయండి.. స్వీట్లు పంచిన స్టాలిన్

 ఏడేళ్లుగా ఎదురు చూసినా ఫలించలేదు

ఏడేళ్లుగా ఎదురు చూసినా ఫలించలేదు

సరైన సాక్ష్యాలు లేనందువల్లే వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ తెలిపారు. సాక్ష్యం కోసం తాను ఏడేళ్లుగా ఎదురుచూశానని, అయినా తన ఎదురుచూపులు ఫలించలేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఏడేళ్లుగా ప్రతి రోజు కోర్టుకు వచ్చా కానీ

ఏడేళ్లుగా ప్రతి రోజు కోర్టుకు వచ్చా కానీ

ఈ కేసులో కోర్టు 1,552 పేజీల తీర్పును వెలువరిచింది. గత ఏడేళ్లుగా అన్ని పనిదినాల్లో తాను కోర్టుకు వచ్చానని, వేసవి సెలవుల్లోనూ పని చేశానని, ఈ కేసులో సరైన సాక్ష్యాన్ని ఎవరైనా సమర్పిస్తారేమోనని ప్రతిరోజూ ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు కోర్టు గదిలో కూర్చున్నానని తీర్పు ప్రతిలో న్యాయమూర్తి సైనీ పేర్కొన్నారు.

 పుకార్లు, ఊహాగానాలుగానే చెప్పారు

పుకార్లు, ఊహాగానాలుగానే చెప్పారు

అయితే ఒక్కరు కూడా సాక్ష్యాన్ని తీసుకురాలేకపోయారని జడ్జి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పుకార్లు, ఊహాగానాలనే చెప్పారు తప్ప నేరాన్ని సాక్ష్యాలతో రుజువు చేయలేకపోయారని తెలిపారు. ఈ కేసుకు ఎంతో పాపులారిటీ వచ్చిందని, తీర్పు కోసం అందరూ ఆతృతగా ఎదురుచూశారని అన్నారు.

 సంతకాలు లేవంటూ సీబీఐ తీరుపై ఆగ్రహం

సంతకాలు లేవంటూ సీబీఐ తీరుపై ఆగ్రహం

ఈ సందర్భంగా సీబీఐ అధికారుల తీరును కూడా జడ్జి ఎండగట్టారు. కోర్టుకు అందించిన పత్రాల్లో సీనియర్‌ అధికారుల సంతకాలు లేవన్నారు. తుది విచారణ సమయంలో సమర్పించిన పత్రంలో అయితే అసలు ఎవరి సంతకమూ లేదన్నారు.

 ఎవరూ సంతకం చేయకుంటే విలువ ఎక్కడ ఉంటుంది

ఎవరూ సంతకం చేయకుంటే విలువ ఎక్కడ ఉంటుంది

ఎవరూ సంతకం చేయకపోతే ఆ డాక్యుమెంట్‌కు విలువ ఏమి ఉంటుందని జడ్జి ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో ఈ కేసులో చాలా లోపాలు ఉన్నాయని జడ్జి సైనీ తెలిపారు.

English summary
Special CBI Judge O.P.Saini on Tursday rued that despite having “religiously” devoted seven years to 2G scam cases, no “legally admissible evidence” was placed before him by the CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X