వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2 జీ స్కామ్: అక్టోబర్ 25న, తీర్పును వెల్లడించనున్న సిబిఐ కోర్టు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కేసులు ఎట్టకేలకు కొలిక్కివచ్చాయి. ఈ కేసుల్లో తుది విచారణను సిబిఐ కోర్టు ఈ ఏడాది అక్టోబర్ 25న,చేపట్టనుంది.

స్పెక్ట్రమ్ కేటాయింపుల కేసులో మాజీ టెలికం మంత్రి ఎ. రాజా, డిఎంకె రాజ్యసభ సభ్యులు కనిమొళి ఇతరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో సమర్పించిన పత్రాలు భారీగా ఉన్నాయి. సాంకేతిక అంశాలతో ముడిపడిన క్రమంలో వీటిని ఇంకా పరిశీలించాల్సి ఉందని విచారణను వాయిదావేస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ అభిప్రాయపడ్డారు.

2G scam case: CBI special court to announce verdict on October 25

తదుపరి విచారణ సందర్భంగా తీర్పును ఎప్పుడు వెలువరించేది వెల్లడిస్తామన్నారు. స్పెక్ట్రమ్ కేసులకు సంబంధించి రెండు వేర్వేరు కేసులను కోర్టు విచారిస్తోంది. వీటిలో ఒక కేసును సిబిఐ , మరో కేసునుఈడీ దర్యాప్తు చేసింది. ఏప్రిల్ 26న, కోర్టులో ఈ కేసులపై తుదివాదనలు ముగిశాయి.

2జీ స్పెక్ట్రం కేటాయింపులో మాజీ మంత్రి రాజా కొన్ని టెలికం సంస్థలపట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని సిబిఐ ఆరోపించింది.

English summary
The Special CBI court to pronounce verdict on October 25th in 2G spectrum case. The trial for the case was concluded in April. The court had asked the accused former telecom minister A Raja, DMK leader Kanimozhi among others to file their clarifications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X