వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముజఫర్‌నగర్ ఎముకల నిగ్గుతేల్చే పనిలో కమిటీ .. 48 గంటల్లో తేలుస్తామని ధీమా ...

|
Google Oneindia TeluguNews

పాట్నా : ముజఫర్‌నగర్ ఆస్పత్రి సమీపంలో కలకలం రేపిన ఎముకలు, పుర్రెలకు సంబంధించి దర్యాప్తు ప్రారంభమైంది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌‌లో తమ విచారణ చేపట్టింది. ఎముకలు ఎవరనే అంశానికి సంబంధించి మూడురోజుల్లో కమిటీ దర్యాప్తు సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో .. కమిటీ ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తోంది.

చిన్నారుల మృతి ..
ఆస్పత్రిలో ఇటీవల మెదడు వాపు వ్యాధితో దాదాపు 108 మంది చిన్నారులు చనిపోయారు. అయితే అక్కడే ఎముకలు, పుర్రెలు కనపించడంతో ఆందోళన నెలకొంది. దీంతో తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నామని ముజఫర్ నగర్ మేజిస్ట్రేట్ అలోక్ రంజన్ ఘోష్ నిన్న పేర్కొన్నారు. కమిటీకి డిప్యూటీ డెవలప్ మెంట్ కమిషనర్ ఉజ్వల్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఆ ఎముకలు చాలా పురాతనమైనవని ఉజ్వల్ పేర్కొన్నారు. ఇప్పటికే వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు.

3-day deadline to solve Muzaffarpur skeletons mystery: Probe begins

ఎముకలు .. పుర్రెలు ...
ఆస్పత్రి సమీపంలో రెండు మృతదేహాలు .. మిగిలినవి ఎముకలు, పుర్రెలు కనిపించాయి. అయితే అక్కడ ఎలా వచ్చాయి ? ఎవరు వీరు ? ఎలా చనిపోయారనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఇటీవల మెదడు వాపు వ్యాధితో చనిపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరు ఎవరనే సందేహం కలుగుతుంది. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం వారు మెదడువాపు వ్యాధితో చనిపోయిన వారు కాదని తేల్చిచెప్పారు. తమకు ఎముకలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించామని చెప్తున్నారు.

English summary
A three-member committee on Tuesday began its probe to find the source of human skeletal remains found near Sri Krishna Medical College and Hospital (SKMCH) in Bihar’s Muzaffarpur, where most of the patients diagnosed with acute encephalitis syndrome (AES) are being treated. Human skeletal remains were found strewn near a garbage dump and in the bushes close to the post-mortem section of the state-run SKMCH last Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X