వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: ముగ్గురి మృతి, కానీ కోవిడ్ వల్ల కాదట, ఆ రాష్ట్ర అధికారుల తీరు ఇది...?

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మరి ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. వరల్డ్ మ్యాప్‌లోని అన్నిదేశాలకు వైరస్ సోకింది. వైరస్ భారత్‌ను కూడా వణికిస్తోంది. కరోనా వైరస్ సోకి రాజస్థాన్‌లో ముగ్గురు చనిపోయారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాత్రం వారు కోవిడ్ సోకి చనిలేదని స్పష్టంచేశారు. ఇతర అనారోగ్య కారణాలతోనే చనిపోయారని వివరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరు విమర్శలకు దారితీస్తుంది.

ముగ్గురు చనిపోతే..?

ముగ్గురు చనిపోతే..?

రాజస్థాన్‌లో మార్చి 20 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ముగ్గురు చనిపోయారు. వారిలో ఇటలీకి చెందిన పర్యాటకుడు ఒకరు కాగా ఇద్దరు వృద్దులు ఉన్నారు. 69, 85 ఏళ్ల వృద్దులు వైరస్ సోకి చనిపోయారు. రాష్ట్రంలో వైరస్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. చనిపోయిన ముగ్గురు కోవిడ్ వల్ల మృతిచెందలేదని.. ఇతర కారణాలతో చనిపోయారని అదనపు ప్రధాన కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. చనిపోయిన ముగ్గురు కరోనా వల్ల కాదు.. ఇతర సమస్యల వల్లేనని సావాయ్ మాన్ సింగ్ ఆస్పత్రి వైద్యులు కూడా ధృవీకరించడం విశేషం.

ఇటలీ పర్యాటకుడు

ఇటలీ పర్యాటకుడు

మార్చి 20వ తేదీన ఇటలీకి చెందిన పర్యాటకుడు (69) సావయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో చేరాడు. కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రిలో చేరగా.. అతను చైన్ స్మోకర్ అని ఇతర సమస్యలు ఉన్నాయని చెప్పి డిశ్చార్జ్ చేశారు. తర్వాత ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి అత్యాధునిక సదుపాయాలతో చికిత్స అందించారు. హెచ్ఐవీ తర్వాత ప్రభావం చూపించే ట్రీట్ మెంట్.. అతనితోపాటు భార్యకు కూడా అందజేశారు. మలేరియా, స్వైన్ ప్లూకి అందించే చికిత్స చేసినా.. అక్కడే పర్యాటకుడు చనిపోయాడని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కానీ అతని భార్య మాత్రం కోలుకుందని చెప్పారు.

కిడ్నీ ఫెయిల్యూర్ అట..

కిడ్నీ ఫెయిల్యూర్ అట..

మార్చి 26వ తేదీన బిల్వారాకి చెందిన 73 ఏ్ల వృద్దుడికి కరోనా సోకగా.. అతనికి షుగర్ ఉంది అని, కిడ్నీ సంబంధిత వ్యాధి ఉందని అధికారులు చెప్తున్నారు. కిడ్నీ ఫెయిలై కోమాకు వెళ్లి.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని కొత్త కథ అల్లారు. కానీ కరోనా పాజిటివ్ సోకి చనిపోయారని తప్పుడు కథనాలు అల్లుతున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

Recommended Video

Pawan Kalyan Urges S Jaishankar To Help Stranded Indian Students In UK
మరొకరి బ్రెయిన్..

మరొకరి బ్రెయిన్..

ఏప్రిల్ 2వ తేదీన 85 ఏళ్ల వృద్దుడు ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చేరాడు. కానీ అతడు బ్రెయిన్ హెమరేజ్‌తో చనిపోయారని వైద్యులు చెప్తున్నారు. వాస్తవానికి అతనికి కరోనా వైరస్ సోకి చనిపోయాడు. కానీ రాజస్థాన్ వైద్యులు మాత్రం వైరస్ సోకలేదని కబుర్లు చెప్తున్నారు.

English summary
Three people with coronavirus infections have died in Rajasthan in less than a fortnight, but the state government insists it wasn't the virus that killed them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X