వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోటెత్తిన భక్తులు: కార్తీక పౌర్ణమి వేళ తొక్కిసలాట, ముగ్గురు మృతి
పాట్నా: కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తడంతో.. వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో తొక్కిలాసట జరిగింది. దీంతో ముగ్గురు భక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.
బీహార్ బెగుసరాయ్ లోని సిమారియా గంగా నది ఘాట్ వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాటలో మరో 10మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

తొక్కిసలాటలో ముగ్గురు మృత్యువాత పడగా.. రెండు మృతదేహాలను నదిలోకే విసిరేసినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. తొక్కిసలాట సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. తొక్కిసలాటలో మృతి చెందినవారికి బిహార్ సీఎం నితీష్ కుమార్ రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.