వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి భవన్‌లో నల్ల త్రాచు.. పట్టుకున్న సిబ్బంది

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వర్షాలు సమృద్ధిగా కురుస్తోన్నాయి. వానలతో పాములు కూడా బయటకొస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లోకి ఓ పాము వచ్చింది. దీంతో హైరానా పడ్డ సిబ్బంది .. వెంటనే పాములను పట్టేవారిని పిలిపించారు. వెంటనే వచ్చిన వారు మూడడుగుల నల్ల త్రాచును పట్టుకొన్నారు. దీంతో అక్కడున్న సిబ్బంది హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

3-foot-long cobra rescued from Rashtrapati Bhavan’s security room

రాష్ట్రపతి భవన్ గేట్ నంబర్ 8 వద్దగల సెక్యూరిటీ క్యాబినె్ వద్ద పాము కనిపించింది. 3 అడుగుల త్రాచు పాము కావడంతో అక్కడున్న సిబ్బంది భయపడ్డారు. వెంటనే ఎన్జీవో సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు రంగప్రవేశం చేసి పామును బంధించారు. ఇటీవల ఢిల్లీ సమీపంలో వర్షాలు కురుస్తుండటంతో పాములు బయటకు వస్తున్నాయని వైల్డ్ లైఫ్ ఎస్ వో ఎస్ డిప్యూటీ డైరెక్టర్ వసీం అక్రం. సెక్యూరిటీ గది వద్ద పాము చొరబడిందని వసీం పేర్కొన్నారు. దీంతో తమ సిబ్బంది రంగంలోకి కాపాడారని తెలిపారు. దానిని పట్టుకొని .. అరణ్యంలో వదిలేశామని వివరించారు.

English summary
A three-foot-long cobra was rescued from inside the security cabin at gate number 8 of Rashtrapati Bhavan on Thursday. The security personnel at Rashtrapati Bhavan spotted the snake sitting inside the security cabin and immediately called a NGO working on rescuing wild animals. A rapid response unit of Wildlife SOS rushed to the spot and rescued the snake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X