• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాయింట్ బ్లాంక్‌లో పిస్టోల్.. మైనర్ బాలికపై ముగ్గురు లైంగికదాడి.. తర్వాత మరో ఇద్దరు కూడా...

|

గుర్గావ్ : పాయింట్ బ్లాంక్‌లో పిస్టోల్ పెట్టి లైంగికదాడి చేశాడో నీచుడు. తర్వాత స్నేహితులను కూడా పిలిచి పాడుపని చేయించాడు. కాస్తైనా కనికరం లేకుండా వదిలేసి వెళ్లిపోయాడు. ఊరి చివర నిస్తేజంగా ఉన్న ఆమెపై జాలి చూపాల్సిన మరో ఇద్దరు కూడా ఆ చూపుతో చూశారు. దయ లేకుండా లైంగికదాడి చేసి .. వెళ్లిపోయారు. ఎండకు ఎండి, వానకు తడుస్తూ అలాగే ఉండిపోయిందా బాలిక .. చివరికి ఆమె తండ్రి తన ఆచూకీ తెలుసుకొని వైద్యం అందించడంతో కొనఊపిరితో బయటపడింది మైనర్ బాలిక. హర్యానాలో జరిగిన ఈ దారుణ ఘటన విస్మయానికి గురిచేస్తోంది.

బాలికపై అఘాయిత్యం ..

బాలికపై అఘాయిత్యం ..

హర్యానాలోని పన్హానాకు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక చదువుతుంది. కానీ జూలై 30 ఆమె జీవితంలో చీకటి నింపింది. ఆమెకు తెలిసిన ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే పన్హాన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ ఆమె ఆచూకీని పోలీసులు కనుగొనడంలో విఫలమయ్యారు. బాలికను కిడ్నాప్ చేసిన నీచుడు .. లైంగికదాడికి పాల్పడ్డాడు. అలా ఇలా కాదు తన వద్ద ఉన్న దేశీ తుపాకీని పాయింట్ బ్లాంక్‌లో పెట్టి మరీ లైంగికదాడి చేశాడు. పలుమార్లు దుశ్చర్యకు పాల్పడ్డాడు. తర్వాత తన స్నేహితులను పిలిచాడు. వారు కూడా ఆ పసిమొగ్గపై లైంగికదాడి చేశారు. తర్వాత ఆమెను ఊరి బయట నిర్జీవ ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోయారు. కదల్లేని స్థితిలో ఉన్న బాలిక అక్కడే పడి ఉంది.

మళ్లీ ఇద్దరు ..

మళ్లీ ఇద్దరు ..

అక్కడినుంచి ఎలాగోలా రహదారిపైకి చేరుకుంది బాలిక. అటు నుంచి వస్తోన్న కారులో ఇద్దరు వస్తున్నారు. తన విషయం చెప్పి ఇంట్లో వదిలేయాలని కోరితే దయ, జాలి చూపాల్సిన వారు కూడా కరుణించలేదు. ఆమెను నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి మళ్లీ లైంగికదాడి చేశారు. దీంతో ఆ యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది. కనీసం వీరు కూడా ఆమెను ఇంటి వద్ద దింపే ప్రయత్నం చేయలేదు. ఊరి చివర వదిలేసి వెళ్లపోవడంతో .. దిక్కుతోచని స్థితిలో యువతి ఉండిపోయింది. మరునాడు ఇంటికి సమీపంలో బాలిక ఉందని తండ్రికి సమాచారం అందింది. ఆమెను చూసి తండ్రి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కేసు నమోదు

కేసు నమోదు

తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక తల్లికి చెప్పుకుని బోరున విలపించింది. దీంతో వారు పన్హానా పోలీసు స్టేసన్‌లో ఫిర్యాదు చేశారు. అంతకుముందు తమ కూతురు కనిపించలేదని కంప్లైంట్ చేశామని .. కానీ తెలిసిన వ్యక్తే పాడుపని చేశాడని వాపోయారు. వారి ఫిర్యాదు మేరకు 34, 363, 366ఏ, 506 .. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును మహిళ పోలీసుస్టేసన్‌కు బదిలీ చేశారు. బాలికపై లైంగికదాడి చేసిన నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు.

English summary
minor girl was allegedly gangraped by three men and then again by two men on the same day on July 30 in Haryana's Punhana, police said on Wednesday. the minor has said that one of the accused is her acquaintance. He kidnapped her and took her to an isolated place and then raped her along with two of his friends whom he called later. They raped her and threatened her with a country-made pistol before leaving her at an isolated area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X