వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నివర్ ఎఫెక్ట్: తమిళనాడులో ముగ్గురి మృతి.. నెలకొరిగిన వృక్షాలు...

|
Google Oneindia TeluguNews

నివర్ తుపాన్ జనం జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల వారిని ఇబ్బందులకు గురిచేసింది. బే బెంగాల్ గుండా వృద్ది చెంది.. పుదుచ్చేరి తీరం గుండా దాటిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఉదయం 8.30 గంటల వరకు తుపాన్ బలహీనపడింది.. మధ్యాహ్నం వరకు ప్రభావం క్రమంగా తగ్గిపోయిందని వాతావరణ శాఖ తెలిపింది.

 3 killed, trees uprooted as severe cyclonic storm ravages Tamil Nadu

పుదుచ్చేరి, తమిళనాడు, ఏపీలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రాష్ట్ర విపత్ బృందాలు, నేవీ కలిసి సహాయ పునరావాస చర్యలు చేపట్టాయి. పోలీసులు, జిల్లా యంత్రాంగంతో కలిసి సహాయ చర్యలు చేపట్టారు. తుపాను వల్ల తమిళనాడులో ముగ్గురు చనిపోయారు. పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌లో కలిసి వెయ్యి వృక్షాలు నెలకొరిగాయి. గతనెల నుంచి తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

పుదుచ్చేరిలో చాలా చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కుంగిపోయాయి. 2 వేల మందికి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. అయితే ఇక్కడ ఎవరూ చనిపోలేదని సీఎం నారాయణ స్వామి తెలిపారు. నెలకొరిగిన చెట్లను అగ్నిమాపక సిబ్బంది తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

English summary
Nivar disrupted normal life in Puducherry, neighbouring Tamil Nadu and parts of Andhra Pradesh on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X