వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్ర ఘాతుకం: కాల్పుల్లో ముగ్గురు బీజేపీ నేతలు మృతి

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయి దారుణానికి తెగబడ్డారు. కుల్గాంలోని వైకే పొరా గ్రామంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కార్యకర్తలపై కాల్పులు జరిపారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న కుల్గాం సీనియర్ పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న బీజేపీ నేతలపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో బీజేపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు.

 3 Local BJP Leaders Killed by Militants in Kashmir’s Kulgam

క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో వైకే పొరాకు చెందిన ఫైదా హుస్సేన్ యాతో, ఉమర్ రంజాన్, సోపాట్ దేవసర్‌కు చెందిన ఉమర్ రషీద్ బేగ్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పోలీసులతోపాటు భారత సైనికులు తనిఖీలు చేపట్టారు. కాగా, గత కొద్ది నెలలుగా భారతీయ జనతా పార్టీ నేతలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల కాలంలో ఉగ్రవాదుల దాడిలో పదుల సంఖ్యలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

మరో ఘటనలో, నిల్డూరా గ్రామంలో జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్‌లో మరో యువకుడిని ఉగ్రవాదులు కాల్చి గాయపరిచారు. బాధితురాలికి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించారు.

English summary
Militants opened fire at three local BJP leaders in Qazigund area of Jammu and Kashmir's Anantnag district on Thursday. While confirming the incident, Kulgam Police said that victims Fida Hussain Yatoo, Umar Ramzan Hajjan and Umar Rashid Beg could not survive the attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X