దారుణం.. మహిళపై ముగ్గురి గ్యాంగ్ రేప్.. జననాంగాల్లో గాజు గ్లాసుతో చిత్రహింసలు...
రాజస్తాన్‌లో ఓ దళిత మహిళ అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముగ్గురు వ్యక్తులు ఆమెపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడటమే గాక చిత్రహింసలకు గురిచేశారు. ఆమె జననాంగాల్లో గాజు సీసాను గుచ్చి పైశాచికానందం పొందారు. ఈ విషయం బయటకు పొక్కితే ఆమెతో పాటు ఆమె కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. ఘటన జరిగిన 6 రోజుల తర్వాత బాధితురాలు ఎట్టకేలకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ నెల 19న...
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం... రాజస్తాన్‌లోని నగౌర్ జిల్లాకు చెందిన బాధితురాలు ఈ నెల 19న తమ ఇంటి సమీపంలోని ఓ ఫామ్‌కి బయలుదేరింది. ఈ క్రమంలో ఆమెను అడ్డగించిన ముగ్గురు దుండగులు బలవంతంగా ఆమెను అపహరించారు. ఆ తర్వాత ఆమెపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో చిత్రహింసలకు గురిచేశారు. గాజు గ్లాసును ఆమె జననాంగాల్లో గుచ్చి నరకం చూపించారు.

ఇంటికెళ్లి మరీ బెదిరింపులు...
గ్యాంగ్ రేప్ విషయం పోలీసులకు చెప్తే ఆమెతో పాటు ఆమె కుటుంబాన్ని చంపేస్తామని ఆ ముగ్గురు బెదిరించారు. బాధితురాలు గ్యాంగ్ రేప్ విషయం తన కుటుంబంతో చెప్పింది. ఈ విషయం తెలిసి ఆ ముగ్గురు నిందితులు ఆమె ఇంటికొచ్చి మరీ బెదిరించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని బాధితురాలి కుటుంబ సభ్యులను కూడా బెదిరించారు.

ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు...
నిందితులు ఇంటికొచ్చి మరీ బెదిరించడంతో బాధితురాలి కుటుంబం తీవ్ర భయాందోళనకు లోనైంది. అయితే ఘటన జరిగిన 6 రోజులకు ఎట్టకేలకు ధైర్యం చేసి వారు పోలీసులను ఆశ్రయించారు. గ్యాంగ్ రేప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పర్బత్సర్ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేయగా... మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బదౌని జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సాయంత్రం సమయంలో ఆలయానికి వెళ్లిన 50 ఏళ్ల వివాహితపై పూజారి,అతని ఇద్దరు శిష్యులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమె జననాంగాల్లో ఇనుప రాడ్డును జొప్పించి చిత్రహింసలకు గురిచేశారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది.