• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఢిల్లీలో హింస, కర్ఫ్యూ, డోంట్ కేర్: బైక్ ల్లో అజిత్ ధోవల్ కాన్వాయ్ ఓవర్ టేక్, జై శ్రీరామ్, షాక్ !

|

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనలతో అట్టుడుకుతోంది. గత మూడు రోజులుగా ఢిల్లీ ఈశాన్య ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లలో 20 మంది మృతి చెందగా సుమారు 230 మంది వరకు గాయపడ్డారు. చాలచోట్ల కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలులో ఉన్నా దాన్ని పాటించేవారు కరువయ్యారు. అనేక వీధుల్లో ముష్కరులు స్వైర్యవిహారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఢిల్లీ స్పెషన్ పోలీసు కమిషనర్ శ్రీవత్సవా తదితరులు సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో ఒకే బైక్ లో వారి కాన్వాయ్ ను ఓవర్ టేక్ చేసుకుంటూ వెళ్లిన ముగ్గురు ఓ మతానికి అనుకూలంగా నినాదాలు చెయ్యడంతో వారు షాక్ కు గురైనారు. అల్లరిమూకలు ఢిల్లీలో హల్ చల్ చేస్తున్నారు.

1990లో ట్రంప్ తాజ్ మహల్ యజమాని, వివాదాలతో నాడు అమ్మేశాడు, నేడు భారత్ లో స్వయంగా తాజ్!

 ఢిల్లీ ఈశాన్యంలో హింస

ఢిల్లీ ఈశాన్యంలో హింస

దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనలతో గత మూడు రోజుల నుంచి ఢిల్లీ ఈశాన్య ప్రాంతాలు అట్టుడుకుతోంది. ముఖ్యంగా చాంద్ బాగ్, మౌజ్ పూర్, జఫరాబాద్, భజన్ పూర్, గోకుల్ పురి, కరవల్ నగర్ తదితర ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసతో ప్రజలు భయాందోళనకు గురై బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.

 హింసలో 20 మంది మృతి

హింసలో 20 మంది మృతి

ఢిల్లీ ఈశాన్య ప్రాంతాల్లో జరిగిన హింసలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందగా సుమారు 230 మంది గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం కూడా హింస తగ్గుముఖం పట్టలేదు. ఢిల్లీ ఈశాన్య ప్రాంతాల్లో బుధవారం పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మందు జాగ్రత్త చర్యలో భాగంగా బుధవారం జరగవలసిన అన్ని పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.

 అజిత్ ధోవల్ పర్యటన

అజిత్ ధోవల్ పర్యటన

ఢిల్లీలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఢిల్లీ సిటీ స్పెషల్ పోలీసు కమిషనర్ శ్రీవాత్సవ తదితరులు మంగళవారం అర్ధరాత్రి నుంచి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. గోకుల్ పురి చౌక్, మౌజ్ పూర్, జఫ్రాబాద్, సీలంపూర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన అజిత్ ధోవల్, శ్రీవాత్సవ పరిస్థితిని సమీక్షించారు.

ధోవల్ కాన్వాయ్ ఓవర్ టేక్ చేస్తూ నినాదాలు

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పర్యటించిన ప్రాంతాల్లో కొన్నిచోట్ల 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే ఆ సమయంలో ఒకే బైక్ లో ముగ్గురు యువకులు హెల్మెట్ లు కూడా వేసుకోకుండా అజిత్ ధోవల్, సిటీ స్పెషల్ పోలీసు కమిషనర్ శ్రీవాత్సవ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని ఓవర్ టేక్ చేస్తూ జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్లారు.

 సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

హింసాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలులో ఉన్నా సరే లెక్క చెయ్యకుండా ధీమాగా బైక్ లో సంచరిస్తూ ప్రాణాలను కూడా లెక్కచెయ్యకుండా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుని వెళ్లడంతో అజిత్ ధోవల్ తో పాటు పోలీసు అధికారులు షాక్ కు గురైనారు. యువకులు బైక్ ల్లో వెలుతున్న సమయంలో వెనుక నుంచి కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి.

 ప్రాణాలు అంటే డోంట్ కేర్ ?

ప్రాణాలు అంటే డోంట్ కేర్ ?

ఈశాన్య ఢిల్లీలో హింసను అరికట్టడానికి ప్రభుత్వం, పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నా ఇలా ప్రాణాలను లెక్కచెయ్యకుండా యువకులు రోడ్ల మీదకు రావడంతో పోలీసులు, ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. మొత్తం మీద ఎలాగైనా ఢిల్లీలో అల్లర్లను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పోలీసులు అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

English summary
New Delhi: Despite “curfew”, “shoot at sight” orders in place, 3 men on a motorbike with Lathi, chanting Jai Shree Ram barge into the cavalcade of NSA DOVAL while he was taking stock of situation in NEW Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more