• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యూరీ దాడి తరహాలో భారీ ఉగ్ర కుట్ర : భగ్నం చేసిన ఆర్మీ, ముగ్గురు ఉగ్రవాదులు హతం, భారీగా ఆయుధాలు సీజ్

|

జమ్ము కాశ్మీర్ లో భారత భద్రతా దళాలు ఓ భారీ ఉగ్రదాడిని విఫలం చేశాయి. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై ఉన్న యూరీ సమీపంలోని రాంపూర్ సెక్టార్‌లో భారీగా ఉగ్రవాదుల చొరబాట్లు జరుగుతున్నాయన్న సమాచారంతో గత కొద్ది రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో భారత సైన్యం గురువారం ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో భారీ ఉగ్రదాడి విఫలమైంది.వారి వద్ద నుండి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు మరి కొంత మంది ఉగ్ర మూక కోసం వేట కొనసాగిస్తుంది.

ముగ్గురు టెర్రరిస్ట్ లను హతమార్చిన భద్రతా దళాలు

ముగ్గురు టెర్రరిస్ట్ లను హతమార్చిన భద్రతా దళాలు


నివేదికల ప్రకారం ఈరోజు తెల్లవారుజామున రాంపూర్ సెక్టార్‌లోని హత్లాంగా అటవీప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై భద్రత దళాలకు సమాచారం అందడంతో ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించారని గుర్తించిన ఆర్మీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడంతో వారి ప్రయత్నాన్ని నిలువరించామని లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే వెల్లడించారు. ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదుల నుండి భారత సైన్యం 5 ఏ కె-47 లు, 8 పిస్టల్‌లు మరియు 70 హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది కాశ్మీర్‌లో ఇప్పటివరకు మొత్తం 97 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి భారీ ఉగ్ర కుట్రతో భారత్ లోకి

పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి భారీ ఉగ్ర కుట్రతో భారత్ లోకి

సెప్టెంబర్ 18 న ఇదే విధమైన ప్రయత్నం జరిగిందని, అప్పుడు కూడా దానిని సమర్ధంగా ఎదుర్కొన్నామని జనరల్ డిపి పాండే, చినార్ కార్ప్స్ కమాండర్ మీడియాతో చెప్పారు. ఉగ్రవాదులు ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) నుండి భారతదేశ భూభాగంలోకి ప్రవేశించారని తెలుస్తుంది. మరణించిన ఉగ్రవాదులలో ఒకరు పాకిస్థానీ అని తెలుస్తుంది. ఇతర ఉగ్రవాదుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. మిగతా ముగ్గురు తప్పించుకున్నారని, వారి కోసం ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని వెల్లడించారు. రాంపూర్ సెక్టార్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ కూడా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

 సెప్టెంబర్ 18 యూరీ దాడుల తరహాలో మళ్ళీ ప్లాన్ .. ఉగ్ర కుట్ర భగ్నం

సెప్టెంబర్ 18 యూరీ దాడుల తరహాలో మళ్ళీ ప్లాన్ .. ఉగ్ర కుట్ర భగ్నం

2016 సెప్టెంబర్ 18వ తేదీన భారీగా సాయుధులైన నలుగురు ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పట్టణ పై దాడి చేశారు. అప్పుడు యూరీ పట్టణంలోని భారత సైనిక బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ పై మెరుపు దాడి చేసిన సాయుధ ఉగ్రవాదులు మూడు నిమిషాల్లో 17 గ్రేడ్లు విసిరారు. ఆ ఘటనలో 17మంది సైనికులు, సైనికాధికారులు అక్కడికక్కడే మరణించారు. మరో 30 మంది సైనికులు ఈ దాడిలో గాయపడ్డారు. మొత్తం నాడు జరిగిన దాడిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించడంతో మొత్తంగా ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. ఇప్పుడు మళ్లీ సెప్టెంబర్ 18 దృష్టిలో పెట్టుకొని ఇదే తరహా దాడులకు పాల్పడాలని ఉగ్రవాదులు పెద్ద ఎత్తున చొరబాట్లకు దిగుతున్నారని భద్రతా బలగాలకు ఉన్న సమాచారంతో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా భారీ ఉగ్రదాడి భగ్నం చేశారు.

దక్షిణ కాశ్మీర్ లోనూ ఎన్ కౌంటర్ .. ఒక ఉగ్రవాది మృతి


ఇదిలా ఉంటే దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. బుధవారం రాత్రి, గతంలో ఓవర్ గ్రౌండ్ వర్కర్ (OGW) గా ఉన్న ఇటీవల ఉగ్రవాది అయిన అనాయత్ అష్రఫ్ దార్ కాశ్మీర్ పౌరుడు జీవీర్ హమీద్ భట్ పై కాల్పులు జరిపాడు, అతను తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. అనాయత్ ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న క్రమంలో కాల్పులు జరపగా, భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో అనాయత్ మృతి చెందాడు. అతను కాక మరి కొంత మంది ఉగ్రవాదులు కూడా ఉన్నారని సమాచారం. వారి కోసం గాలింపు కొనసాగుతుంది.

జమ్మూ కాశ్మీర్ లో ఆందోళనకర పరిస్థితులు

ఈ సంవత్సరం భారత భద్రతా దళాలు మరియు పోలీసులు టెర్రరిస్టులు తిరిగి జనజీవన స్రవంతి లోకి వచ్చి లొంగిపోయే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ కారణంగా భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను తట్టుకోలేని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల హ్యాండ్లర్లు తీవ్ర అసహనం లో ఉన్నారని, వారు నిరాయుధ పోలీసులను మరియు పౌరులను చంపటానికి దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఏది ఏమైనా తాజా పరిస్థితులు జమ్మూ కాశ్మీర్ లో ఆందోళన కలిగిస్తున్నాయి.

English summary
Security forces gunned down 3 Pakistani terrorists near Uri, jammu and kashmir. 5 AK-47s, 8 pistols & 70 hand grenades recovered from terrorists killed in the operation.Army foiled big terror plot and continueing search operation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X