వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల కొంప ముంచిన డ్యాన్స్: సస్పెండ్ చేసి చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు; ఎక్కడంటే

|
Google Oneindia TeluguNews

సరదాగా పోలీసులు చేసిన పని వారి కొంపముంచింది. ఉద్యోగానికే ఎసరు పెట్టేలా చేసింది. పోలీస్ యూనిఫాం వేసుకుని, కారులో ప్రయాణం చేస్తూ, పాటలు వింటూ ముగ్గురు పోలీసులు చేసిన డాన్స్ వారిని ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యేలా చేసింది. గుజరాత్లోని కచ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

5సంవత్సరాల లోపు పిల్లలకు మాస్కులు సిఫార్సు చెయ్యలేదు: కేంద్రం సవరించిన మార్గదర్శకాలు5సంవత్సరాల లోపు పిల్లలకు మాస్కులు సిఫార్సు చెయ్యలేదు: కేంద్రం సవరించిన మార్గదర్శకాలు

 కారులో ప్రయాణిస్తూ యూనిఫాంలో పోలీసుల డ్యాన్స్ .. ముగ్గురు సస్పెండ్

కారులో ప్రయాణిస్తూ యూనిఫాంలో పోలీసుల డ్యాన్స్ .. ముగ్గురు సస్పెండ్

కారు ప్రయాణంలో సంగీతాన్ని ఆస్వాదిస్తూ పోలీసులు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముగ్గురు గుజరాత్ పోలీసు కానిస్టేబుళ్లను పోలీసుశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, నలుగురు పోలీసులు యూనిఫాంలో ప్రయాణిస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న వాహనం యొక్క స్టీరియోపై ప్లే చేసిన పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకున్నారు. ఆ సమయంలో వారు ఎటువంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదు.

ట్రాఫిక్ రూల్స్ పాటించని పోలీసులపై చర్యలు ...

సీట్ బెల్ట్‌లు ధరించలేదు, మాస్కులు పెట్టుకోలేదు. ఇక ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడంతో జగదీష్ సోలంకి, హరేష్ చౌదరి మరియు రాజా హిరాగర్‌ ముగ్గురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. వారు గాంధీధామ్ ఏ పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా ఉన్నారు. కచ్-గాంధీధామ్ పోలీసు సూపరింటెండెంట్ మయూర్ పాటిల్ కార్యాలయం ఒక ప్రకటనలో, గాంధీధామ్ ఎ డివిజన్ పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా ఉన్న ముగ్గురు పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

ఇలాంటి ఘటనలతో పోలీస్ శాఖకు చెడ్డపేరు వస్తుందన్న కచ్-గాంధీధామ్ పోలీసు సూపరింటెండెంట్

ఇలాంటి ఘటనలతో పోలీస్ శాఖకు చెడ్డపేరు వస్తుందన్న కచ్-గాంధీధామ్ పోలీసు సూపరింటెండెంట్

ఫోలీసు యూనిఫాం ధరించి, కారు లోపల, పాటలపై డ్యాన్స్ చేస్తున్న పోలీసు సిబ్బందికి సంబంధించి వైరల్ వీడియో ఒకటి తమ దృష్టికి వచ్చిందని క్రమశిక్షణతో కూడిన డిపార్ట్‌మెంట్‌ లో ఇలాంటివి క్షమించేది కాదని అందుకే వారిని సస్పెండ్ చేస్తున్నట్లు గా ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పోలీసులకు చెడ్డపేరు తెస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. వాహనంలో ప్రయాణం చేసిన నలుగురు పోలీసులలో, గాంధీధామ్ ఏ డివిజన్ పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా ఉన్న ముగ్గురిని తక్షణమే సస్పెండ్ చేశారు,

 మరొక పోలీస్ పై చర్యలకు సిఫార్సు.. కారులో చేసిన డ్యాన్స్ కొంప ముంచింది

మరొక పోలీస్ పై చర్యలకు సిఫార్సు.. కారులో చేసిన డ్యాన్స్ కొంప ముంచింది

బనస్కాంత పోలీసులతో అటాచ్ చేసిన నాల్గవ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేస్తూ బనస్కాంత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కు లేఖ వ్రాసినట్లుగా వెల్లడించారు. బాధ్యతాయుతమైన వృత్తుల్లో కొనసాగుతున్న వారికి కొన్ని పరిమితులు ఉంటాయని, వాటికి అనుగుణంగా ప్రవర్తించాల్సి ఉంటుందని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వీడియో ఎప్పుడు చిత్రీకరించబడిందో స్పష్టంగా తెలియలేదు కానీ ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే మరొక సంఘటనలో, ఘజియాబాద్ పోలీసు ఒక రెస్టారెంట్ నుండి రూ. 3,800 విలువైన ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. ఆర్డర్ వచ్చిన తర్వాత తాను పోలీసు అయినందున బిల్లు చెల్లించడానికి నిరాకరించాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అతడిని సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టారు పోలీసులు.

English summary
Dance by three policemen in police uniforms, traveling in a car and listening to songs caused them to be suspended from their jobs. The incident took place in Kutch district of Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X