వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ దుశ్చర్య: కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, ముగ్గురు పౌరులు మృతి, మరో 8 మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి బరితెగించి కాల్పులు తెగబడింది. జమ్మూకాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు పాల్పడటంతో ఆరుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు భారత జవాన్లు ఉండగా, ముగ్గురు పౌరులు ఉన్నారు.

జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ మిలిటరీ కాల్పుల విరమణ ఉల్లంఘనలో ముగ్గురు జవాన్లు, ముగ్గురు పౌరులు మరణించినట్లు అధికారులు తెలిపారు.

3 security personnel, 3 civilians, killed In Action In Pakistan Shelling

పాకిస్థాన్ బలగాలు జరిపిన భారీ దాడుల మధ్య ఇద్దరు ఆర్మీ జవాన్లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారి మృతి చెందారు. అదే ప్రాంతంలో ముగ్గురు పౌరులు మరణించారు, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ షెల్లింగ్‌లో సరిహద్దు వెండి ఉన్న పలు పౌరుల ఇళ్లు ధ్వంసమయ్యాయి.

మరోవైపు, పూంచ్ జిల్లాలోని సాజియాన్‌లో పాక్ షెల్లింగ్‌లో ఏడుగురు పౌరులు గాయపడ్డారు. షెల్లింగ్‌కు భారత బలగాలు తీవ్ర ప్రతీకారం తీర్చుకున్నాయని, పాకిస్థాన్ వైపున కూడా భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

Recommended Video

#Indiachinastandoff: Breakthrough in India-China Talks | Oneindia Telugu

పాక్ తరచూ కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తుండటంతో భారత దళాలు కూడా అప్రమత్తమయ్యాయి. పాక్ దుశ్చర్యపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా పాక్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదని మండిపడింది. పాక్ దుశ్చర్యలకు మూల్యం చెల్లించుకోకతప్పదని మరోసారి హెచ్చరించింది.

English summary
Three jawans and as many civilians were killed in ceasefire violation by the Pakistani military along the Line of Control in Jammu and Kashmir's Baramulla district on Thursday, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X