విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైల్వేశాఖ కొత్త ప్రయోగం: రెండు కిలోమీటర్ల పొడవున్న గూడ్స్ బండి..

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సరుకుల రవాణాను వేగవంతం చేయడానికి, ఇంధన ఖర్చును తగ్గించడానికి, దుబారాను అరికట్టడానికి సరికొత్తగా ఆలోచించారు. రెండు కిలోమీటర్ల పొడవు ఉన్న గూడ్స్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు.

సాధారణంగా గూడ్స్ బండి పొడవు చాలా ఉంటుంది. సుమారు 500 మీటర్ల నుంచి 800 మీటర్ల వరకు ఉంటుంది. 50 నుంచి 70 వరకు వ్యాగన్లు ఉంటాయి. అలాంటి మూడు గూడ్స్ రైళ్లను ఒకదానికొకటి జత చేశారు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు. మూడు గూడ్స్ రైళ్లు వెళ్లాల్సిన సమయంలో, ఒకే రైలు వెళ్తుందన్నమాట. దీనివల్ల సమయం ఆదా అవుతుందని, ఇంధన ఖర్చు తగ్గుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

3 Train Rakes With 2-Km-Long goods train towards visakhapatnam port

ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని సంబాల్ పూర్ డివిజన్ లో తొలిసారిగా రెండు కిలోమీటర్ల పొడవు ఉన్న గూడ్స్ రైలును నడిపించారు. మూడు గూడ్స్ రైళ్లను ఒకదానికొకటి జత చేసిన తరువాత దీని పొడవు 2000 మీటర్లకు చేరుకుంది. అంటే- అక్షరాలా రెండు కిలోమీటర్లు. 147 వ్యాగన్లు, మూడు గార్డ్ వ్యాన్లు, నాలుగు ఇంజిన్లు దీనికి ఉన్నాయి.

ఇంత పొడవైన గూడ్స్ రైలు దేశంలో మరెక్కడా లేదు. సంబాల్ పూర్ డివిజన్ పరిధిలోని గోడ్భాగా, బోలంగిర్ స్టేషన్ల మధ్య ఈ రైలును ప్రయోగాత్మకంగా నడిపించారు. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 101 కిలోమీటర్లు. ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా ఈ రైలు రాకపోకలు సాగించింది.

దీనితో ఈ ప్రయోగం విజయవంతమైందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ప్రకటించారు. ఇంత భారీ రైలును విశాఖ పోర్ట్ ట్రస్ట్ కోసం అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులు, దిగుమతులు నమోదవుతుంటాయని, అందువల్ల అతి పొడవైన ఈ రైలును వారికోసం అందుబాటులోకి తెస్తామని అన్నారు. రెండు కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రైలు ఒక్కసారి రైల్వేగేటుకు వద్ద ఎదురైతే.. వాహనదారులు అక్కడ పడిగాపులు పడాల్సిందే.

English summary
With the aim to saves time, energy and run with a single signal giving the line to other passenger trains, the East Coast Railway run 3 train rakes at a time having a total length of about 2000 meters (2 km) on an experimental basis for the first time in Odisha today. It is called Python Rake. The 2-km-long train chugs included 147 Wagons, 3 brake/guard vans and 4 engines and successfully ran 101 km between Godbhaga and Bolangir stations in Sambalpur Railway Division. According to reports, the first rake of 45 flat wagons loaded with containers and the second and third empty rakes of 51 alumina containers each headed towards Visakhapatnam Port.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X