వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లడ్ కాన్సర్‌తో బాధపడుతున్న అవిజిత్‌కు చేయూతనివ్వండి, ప్రాణాన్ని నిలబెట్టండి

Google Oneindia TeluguNews

మూడేళ్ల బాబు అకస్మాత్తుగా, వికారమైన చమటలతో రక్తం కక్కుతూ కనిపిస్తే ఎలా ఉంటుంది... ఊహించుకుంటేనే భయానకంగా ఉంది కదా. పసిపిల్లలకు ఇంజెక్షన్ వేసే క్రమంలో వారికి చిన్న సూదిని గుచ్చితేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. అలాంటిది బ్లడ్ కాన్సర్ గురై, రోగ నిరోధక శక్తి కోల్పోయి, శరీరం కుచించుకుని పోతే పోతే ఆ బాధ వర్ణణాతీతం. తీవ్రమైన బాధ, నొప్పితో పోరాడుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. చాలా బాదగా అనిపిస్తుంది కదా.

"నేను నా ఉద్యోగంతో పాటు అన్నింటినీ వదులుకుని, 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైలోని అపోలో ఆసుపత్రికి నా బిడ్డను తీసుకొచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనైనా నా బిడ్డను నేను కాపాడుకోవాలనుకుంటున్నాను". అంటూ అవిజిత్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

 3 year old Avijit Who Suffers From Cancer Will Not Survive Without Urgent Treatment

అర్చన, ఆమె భర్త ఇద్దరూ కోల్ కత్తాలో తమ కొడుకుతో సంతోషంగా జీవించేవారు. అవిజిత్ ప్రీ స్కూల్ చదువు కోసమని యూనిఫాం దగ్గర నుంచిఅతను పాఠశాలకు వెళ్లేందుకు కావాల్సిన సామాగ్రినంతా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. స్కూల్ బ్యాగ్ , క్రేయాన్స్ అన్నీ తీసుకున్నారు.కానీ వారిపై విధి పగబట్టింది. కొన్ని రోజుల వ్యవధిలోనే అవిజిత్ బాగా బరువు తగ్గడాన్ని గమనించారు.

"ఒక వేసవి రోజున, అందరూ తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బందిపడుతుంటే అవిజిత్ మాత్రం చలిగా ఉందని మంచం కూడా దిగడానికి నిరాకరించాడు. దుప్పటిని పూర్తిగా కప్పుకుని వణికిపోయాడు.
తీవ్ర జ్వరంతో అల్లాడిపోయాడు. ఆ మరుసటి ఉదయం అవిజిత్ ను నిద్రలో నుంచి లేపేందుకు ప్రయత్నించాం.నా కొడుకు నిద్రపోయిన బెడ్ షీడ్,దిండు పూర్తిగా రక్తంతో తడిసిపోయాయి. ముక్కు నుంచి తీవ్రంగా రక్తస్రావమైంది. అవిజిత్ పడుకునే దిండ్లు, బెడ్ షీట్స్ మొత్తం చమటతో ఎల్లప్పుడూ తడిసిపోయి ఉండేవి. రోజూ రాత్రంతా అసౌకర్యానికి గురవుతూ ఉండేవాడు. ఎల్లప్పుడూ ఎత్తుకునే ఉండాల్సి వచ్చేది. ఎంతోసేపు తిప్పితే కానీ నిద్రకు ఉపక్రమించేవాడు కాదు. క్రమంగా తీవ్ర భయాందోళనలకు గురయ్యాము"అంటూ అవిజిత్ తండ్రి తన కుమారుడి పరిస్థితిని వివరించారు.

 3 year old Avijit Who Suffers From Cancer Will Not Survive Without Urgent Treatment

క్రమంగాఅవిజిత్ ఆహారాన్ని తినడానికి కూడా నిరాకరించే వాడు. రోజూ కడుపు నొస్తుందని ఏడ్చేవాడు. దీంతో అతని తల్లిదండ్రులు కోల్ కత్తాలోని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడకొన్ని సాధారణ పరీక్షల చేశారు. వైద్యుడు సూచించిన మందులను అవిజిత్ వేసేవారు. రోజులు గడిచే కొద్ది అవిజిత్ పరిస్థితి మరింత తీవ్రంగా తయారైంది. అతని శరీరం వైద్యానికి కూడా సహకరించేది కాదు.

అవిజిత్ పరిస్థితి గురించి ఆయన తండ్రి మాటల్లోనే "నా కుమారుడికి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వెంటనే కోల్ కత్తాలోని ఒక స్థానిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లాము.అతను రక్త పరీక్షను సూచించారు. నా కుమారుడు రక్త పరీక్షకు సహకరించకుండా, నన్ను గట్టిగా కౌగలించుకుని ఏడుస్తూనే ఉన్నాడు. రక్త పరీక్షలో ప్లేట్లెట్ లెక్కింపు ప్రమాదకరంగా కనపడడం ఆందోళన కలిగించింది. రక్తపరీక్షల అనంతరం, ప్లేట్లేట్స్ కౌంట్ పెరిగే క్రమంలో ఎక్కువ రక్తం అవసరమవుతుందని డాక్టర్స్ చెప్పారు. సమయం గడిచేకొద్దీ ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యం సరిగా మార్గనిర్దేశం చేయలేకపోయారు. అతని కచ్చితమైన వైద్య పరిస్థితి గురించి చెప్పలేకపోయారు. దీనికి అదనంగా ప్రభుత్వాసుపత్రిలోని అనారోగ్య పరిస్థితుల కారణంగా అవిజిత్ దుర్భర స్థితిలో అనేక అంటురోగాల పాలయ్యాడు."

చివరగా, ఆసుపత్రి యాజమాన్యం చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్లాలని సూచించింది.వెంటనే నిర్ణయం తీసుకోక తప్పలేదు. కోల్ కత్తా నుంచి 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైకు అవిజిత్ ను తీసుకుని వచ్చేశాం.నా కుమారుని ఆరోగ్యం కోసం ఎంత కఠినమైన నిర్ణయాలైనా తీసుకునేందుకు వెనుకాడలేదు. నా చిన్నపాటి జాబ్ ను కూడా వదులుకుని చెన్నై వచ్చేశాము. చెన్నైలో ఆస్పత్రిలో చేర్చాం.అక్కడ ముఖ్యమైన రక్త పరీక్షలు చేశారు. వ్యాధి నిర్ధారణలో అవిజిత్ బ్లడ్ క్యాన్సర్ (లుకేమియా) తో బాధపడుతున్నాడని డాక్టర్లు చెప్పారు. అతని ఎర్ర రక్త కణాలు వేగంగా చనిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కీమోథెరపీ మాత్రమే అతన్ని కాపాడగలదని వైద్యులు ధృవీకరిస్తున్నారు.

 3 year old Avijit Who Suffers From Cancer Will Not Survive Without Urgent Treatment

"ప్రస్తుతం మాముందు ఎలాంటి ప్రత్యామ్నాయమూ లేదు.కీమోథెరపీని వెంటనే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. దీనికి సుమారుగా మొత్తం రూ.15 లక్షలు అవసరమవుతుందని తేల్చారు. ఇప్పటి వరకూ మందులు, వైద్య పరీక్షల కోసం రూ.2 లక్షల వరకూ ఖర్చు చేశాము. ప్రయాణాలకి తరచూ వెళ్ళడం అసాధ్యమని గ్రహించాము. తప్పనిసరి పరిస్థితుల్లో, తాత్కాలికంగా మా నివాసాన్ని చెన్నైకి మార్చాము. ఆసుపత్రికి సమీపంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాము. కొత్త నగరం, భాష తెలియదు. ఇక్కడ ఏదైనా పని చేసుకోవాలంటే కూడా కష్టమే. ఎవ్వరూ ఆదరువు లేరు. కాని నేను ఏదో ఒకరీతిలో జాబ్ వెతుక్కోవడానికి నావంతు కృషి చేస్తాను." అంటూ అవిజిత్ తండ్రి కన్నీళ్ల పర్యంతమయ్యాడు.

నెల తిరిగే సరికి, బిడ్డ ఆరోగ్యం కోసం తీసుకున్న అప్పులకు వడ్డీలను కట్టడానికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వీరు కొత్త నగరంలో ఇన్ని కష్టాల మద్య తమ కుమారునికి వైద్యం చేయించుకోవడం తలకు మించిన భారమే. వారి ప్రాణాలన్నీ ఉన్న ఒక్కగానొక్క బిడ్డమీదే ఉన్నాయి.కానీ అతను ఆసుపత్రి పడకకే అంకితమైపోయాడు.

బ్లడ్ కాన్సర్ గురైన అవిజిత్ అనారోగ్యంతో నిరంతరం పోరాడుతూ ఉన్నాడు. అతని ముందున్న ఒకే ఒక్క పరిష్కారం కీమోథెరపీ. కొత్త నగరంలో, వీరికి అన్ని దారులూ మూసుకుని పోయి ఉన్న పరిస్థితి. మీరు చేసే ఏ చిన్న సహకారమైనా వారికి, వారి కుమారుని జీవితాన్ని కాపాడుకునే అవకాశాన్ని ఇస్తుంది. దయచేసి ఈ కథనాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అలాగే మీకు తోచినంత సహాయం చేసి ఆదుకోండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X