వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హమ్మయ్య : తప్పిపోయిన 24 గంటల్లోనే తల్లిదండ్రుల ఒడికి చేరిన చిన్నారి

|
Google Oneindia TeluguNews

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తప్పిపోయిన మూడేళ్ల చిన్నారి ఆచూకీ లభించింది. తప్పిపోయిన 24 గంటల్లోనే కనుగొడంతో పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం తప్పిపోయిన చిన్నారి ఎట్టకేలకు తల్లిదండ్రుల వద్దకు చేరడంతో కథ సుఖాంతమైంది. చిన్నారి తప్పిపోయిందనే సమాచారం .. స్థానికుల అప్రమత్తతో మూడేళ్ల సాక్షి పేరెంట్స్ ఒడికి క్షేమంగా చేరింది.

ముంబైలోని గోరెగావ్‌ పరిసరాల్లో సంతోష్ ఫ్యామిలీ నివసిస్తోంది. ఇతనికి భార్య, మూడేళ్ల కూతురు సాక్షి ఉన్నారు. సంతోష్ భార్య ప్రెగ్నెట్ కావడంతో నిన్న ఆస్పత్రికి బయల్దేరారు. అయితే వీరితోపాటు వచ్చిన చిన్నారి సాక్షి తప్పిపోయింది. దీంతో ఆ పేరెంట్స్ గుండెలు పగిలిపోయాయి. ఎక్కడ ఉందో ? ఏమైందనే ఆందోళనలో ఉన్నారు. చివరికి గోరెగావ్‌లోని భగత్ సింగ్ నగర్ వద్ద సాక్షి కనిపించడం లేదని నిన్న ఫిర్యాదు చేశారు. పాప కోసం వెతికి వెతికి అలసిపోయాడు తండ్రి. ఎలాగైనా దొరుకుతుంది కదా అనే ఆశ వారికి ఉంది.

3 year old reunited with family within a day

ఈ క్రమంలో ఓ పాప తనపై బ్లూ టవల్ వేసుకొని .. రెండు జుట్లతో ఉన్న ఫోటో ఒటకి సోషల్ మీడియాలో వైరలవుతుంది. వాట్సాప్ ఇతర గ్రూపుల్లో కొందరు షేర్ చేస్తున్నారు. ఆమె చేతిలో స్వీట్ బాక్స్, మరో చేతిలో చాక్లెట్లు ఉన్నాయి .. కానీ ఆమె మొహం మాత్రం ఆందోళనతో ఉంది. చిన్నారి వెర్సొవాలోని యారి రోడ్ బియాకా బిల్డింగ్ గేటు వద్ద ఉన్నట్టు గుర్తించారు. ఎవరో కొందరు వచ్చి ఇక్కడ దింపేసి వెళ్లిపోయారని చిన్నారి చెప్పింది. వెంటనే కొందరు పోలీసులు వచ్చి తన వివరాలు అడిగారు. మరికొందరు స్థానికులు సాక్షికి సంబంధించిన సమాచారం ట్విట్టర్‌లో షేర్ చేశారు. పోలీసులు అడిగినప్పుడు తన పేరు సాక్షి అని, తండ్రి పేరు సంతోష్ అని చెప్పింది. ముంబైలోని ఇతర పోలీసు స్టేషన్లలో కిడ్నాప్ కేసు నమోదైందా అని ఆరాతీశారు. అయితే గోరెగావ్‌లోని భగత్ నగర్‌ కేసు నమోదవడంతో .. అతని తండ్రిని పిలిపించారు. అతను తన గర్భవతి అయిన భార్యను తీసుకొని పీఎస్‌కు వచ్చాడు. అక్కడ తమ కూతురిని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురుయ్యారు.

English summary
A photograph of a young girl wrapped in a blue towel and sporting two ponytails had been circulated on WhatsApp and other social media on July 30, Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X