కిరాతకం:ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని మూడేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య
చెన్నై:చెన్నైలో ఆదివారం నాడు దారుణం చోటుచేసుకొంది. మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన చెన్నైలో చోటుచేసుకొంది. బాలిక అదృశ్యమైందని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసిన తర్వాత బాలిక శవంగా దొరికింది.
ఐదేళ్ళ తన సోదరుడితో కలిసి మూడేళ్ళ బాలిక ఇంటి బయట ఆడుకొంటుండగా తప్పిపోయింది. అయితే ఆ సమయంలో ఆ బాలిక తల్లి జ్వరంతో ఇంట్లోనే పడుకొంది.
బాలిక తండ్రి శనివారం మధ్యాహ్నం విధులకు వెళ్ళాడు . ఇంకా తిరిగి రాలేదు. అయితే ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బాలిక తల్లి తన మూడేళ్ళ కూతురు అదృశ్యమైన వషయాన్ని గుర్తించింది.

బాలిక కోసం ఆమె వెతికింది.అయితే బాలిక ఆచూకీ మాత్రం దొరకలేదు.దీంతో ఆమె తన మూడేళ్ళ కూతురు అదృశ్యమైన విషయమై ఆమె తిరువుత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే ఎర్నావూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెత్త కుప్పల వద్ద మూడేళ్ళ బాలిక మృతదేహం కన్పించింది. ఈ విషయాన్ని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.
ఈ సమాచారం ఆధారంగా పోలీసులు అదృశ్యమైన బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. శవాన్ని గుర్తించి తమ కూతురుగానే వారు గుర్తించారు.అయితే బాలికకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని నిందితుడు తీసుకెళ్ళాడని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనతో స్థానికులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. గతంలో కూడ ఇదే తరహలో ఘటనలు చోటుచేసుకొన్నాయి.దీంతో స్థానికులు ఆందోళన నిర్వహించారు.