వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో గత 24 గంటల్లో 30,548 కరోనా కొత్త కేసులు .. భారీగా తగ్గిన కేసుల వెనుక కారణం ఇదే !!

|
Google Oneindia TeluguNews

ఇండియాలో కరోనా వైరస్ కేసులు తీవ్రత కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా చలికాలం తీవ్రతరమవుతుంది కేసుల సంఖ్య పెరుగుతుందని భావిస్తే, కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 30,548 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒక్క రోజులో ఇంత తక్కువ కరోనా కేసులు నమోదు చేయడం ఇదే ఫస్ట్ టైమ్ . జూలై 13 తర్వాత నుండి కరోనా కొత్త కేసులు ప్రతి రోజూ తీవ్రంగా నమోదవుతున్నాయి.

Recommended Video

COVID-19 : Vaccine రాకముందే భారత్ లో ప్రజలు Herd Immunity ని పొందే అవకాశం ఉంది - AIIMS Director

వణికిస్తున్న కరోనా..ఢిల్లీ ,కేరళ ,పశ్చిమబెంగాల్ లో జెట్ స్పీట్ లో కేసులువణికిస్తున్న కరోనా..ఢిల్లీ ,కేరళ ,పశ్చిమబెంగాల్ లో జెట్ స్పీట్ లో కేసులు

 ఆదివారం రోజు తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు

ఆదివారం రోజు తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు

జులై 13 తర్వాత నుండి ఇప్పటివరకు ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కాలేదు. అయితే ఆదివారం రోజు తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు అయినట్టు తాజా వివరాలను బట్టి తెలుస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 88,45,127 కరోనా కేసులు నమోదు కాగా, కొత్తగా మరో 345 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,30 ,070 కు చేరుకుంది. మరణాల రేటు 1.47 శాతంగా ఉంది.

 టెస్టులు తగ్గటం తోనే కేసుల తగ్గుదల .. దేశంలో 4,65,478 యాక్టివ్‌ కేసులు

టెస్టులు తగ్గటం తోనే కేసుల తగ్గుదల .. దేశంలో 4,65,478 యాక్టివ్‌ కేసులు


ఆదివారం రోజున కోవిడ్ టెస్టుల సంఖ్య 8 ,61,706 కు తగ్గటం పాజిటివ్ కేసుల తగ్గుదలకు కారణంగా చెప్పొచ్చు. ఆదివారం టెస్టులు తక్కువగా చెయ్యటం కేసుల తగ్గుదలకు కారణమని తెలుస్తుంది . తాజాగా 43, 851 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని బయటపడ్డారు. దీంతో మొత్తం కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వారి సంఖ్య 82,49,579కు చేరింది. జాతీయ రికవరీ రేటు 93.27 శాతానికి పెరిగింది.ప్రస్తుతం దేశంలో 4,65,478 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.ఇవి మొత్తం కేసుల్లో 5.26 శాతంగా ఉన్నాయి.

గత 24 గంటల్లో 435 కొత్త మరణాలు .. మొత్తం 1,30,070 మరణాలు

గత 24 గంటల్లో 435 కొత్త మరణాలు .. మొత్తం 1,30,070 మరణాలు

ఇప్పటివరకు కరోనా నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 12కోట్ల 56 లక్షల 98 వేల 525 శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.435 కొత్త మరణాలలో ఢిల్లీ నుండి 95, మహారాష్ట్ర నుండి 60, పశ్చిమ బెంగాల్ నుండి 51, పంజాబ్ నుండి 30, మరియు కర్ణాటక మరియు కేరళ నుండి 21 చొప్పున ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,30,070 మరణాలు సంభవించగా, అందులో మహారాష్ట్ర నుండి 45,974, కర్ణాటక నుండి 11,529, తమిళనాడు నుండి 11,478, పశ్చిమ బెంగాల్ నుండి 7,661, ఢిల్లీ నుండి 7,614 మరణాలు అత్యధికంగా నమోదు అయ్యాయి .

English summary
The severity of corona virus cases in India seems to have decreased slightly. If the number of cases is expected to increase as the winter intensifies over the past few days, the number of new cases appears to be declining. In the last 24 hours, 30,548 new cases were reported, according to the Union Health Ministry. This is the first time that so few corona cases have been reported in a single day. Corona new cases have been reported seriously every day since July 13th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X