వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో 30 కోట్ల మందికి సోకిన కరోనా: తాజా సర్వేలో వెల్లడి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశంలో 130 కోట్ల మంది జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనావైరస్ సోకినట్లు ప్రభుత్వ సెరోలాజికల్ సర్వేపై ప్రత్యక్ష పరిజ్ఞానం ఉన్న విశ్వసనీయ సర్వే తెలిపింది. ప్రభుత్వం వాస్తవంగా కరోనా సోకినట్లు చెబుతున్న దానికంటే ఇది ఎన్నో రేట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

దేశంలో 30 కోట్ల మందికి కరోనా..

దేశంలో 30 కోట్ల మందికి కరోనా..

భారతదేశంలో ఇప్పటి వరకు 1,07,00,000 లక్షల మందికి కరోనా సోకింది. అమెరికా తర్వాత రెండో స్థానంలో భారత్ ఉంది. అయితే, ఈ సర్వే మాత్రం భారతదేశంలో ఇప్పటికే 30 కోట్ల మందికిపైగా కరోనా బారినపడ్డారని వెల్లడించింది. ఈ సర్వేను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నిర్వహించింది. అయితే, ఈ సర్వేకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

15 మందిలో ఒకరికి కరోనా యాంటీ బాడీలు

15 మందిలో ఒకరికి కరోనా యాంటీ బాడీలు

ఈ సర్వేలో ఎంతమంది పాల్గొన్నారనేది కూడా ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు.

ఆగస్టు, సెప్టెంబర్‌లలో నిర్వహించిన మరో సర్వేలో 29వేల మందికిపైగా రక్త నమూనాలను సేకరించగా.. ప్రతి 15 మందిలో ఒకరికి కోవిడ్ 19 యాంటీ బాడీలు ఉన్నట్లు తేలింది. 10ఏళ్లకు మించినవారి నుంచి రక్తపు నమూనాలను సేకరించారు. పట్టణ మురికివాడల్లో మాత్రం ప్రతి ఆరుగురిలో ఒకరికి యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు.

55 శాతం మందికి కరోనా..

55 శాతం మందికి కరోనా..

ఢిల్లీ ప్రభుత్వం ఈ వారం విడుదల చేసిన ఒక సర్వేలో 20 మిలియన్ (2 కోట్ల) నివాసులలో సగానికి పైగా కరోనావైరస్ బారిన పడినట్లు తేలింది. కాగా, డయాగ్నస్టిక్స్ సంస్థ థైరోకేర్ టెక్నాలజీస్ భారతదేశం అంతటా 7,00,000 మందికి పైగా చేసిన ప్రత్యేక పరీక్షలలో జనాభాలో 55% మందికి ఇప్పటికే వ్యాధి సోకినట్లు తేలిందని దాని చీఫ్ గత వారం రాయిటర్స్‌తో చెప్పారు.

Recommended Video

#APpanchayatelections: Candidates Election Expense Limit ఎన్నికల్లో ఖర్చు చేయాల్సింది ఎంతో తెలుసా.!
60-70 శాతం రోగ నిరోధక శక్తి అవసరం

60-70 శాతం రోగ నిరోధక శక్తి అవసరం

ట్రాన్స్‌మిషన్ చైన్‌ను విచ్ఛిన్నం చేయడానికి జనాభాలో కనీసం 60% నుండి 70% మందికి రోగనిరోధక శక్తి అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. భారత్‌లో బుధవారం 11,039 కొత్త కేసులు నమోదయ్యాయి. 110 మరణాలు సంభవించడంతో మొత్తం 154,596కు చేరుకున్నాయి. సెప్టెంబరు మధ్యకాలం నుంచి రోజుకు 1,00,000 వరకు ఉన్న కేసులు, మరణాలు ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా టీకా కార్యక్రమంగా ప్రకటించిన.. ప్రభుత్వం 18 రోజుల్లో 4 మిలియన్లకు పైగా (40 లక్షల మందికి పైగా) ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయిచింది. ఆగస్టులోపు 300 మిలియన్లకు (30 కోట్లు) చేరుకోవడమే లక్ష్యంగా పేర్కొంది.

English summary
About one in four of India's 1.35 billion people may have been infected with the coronavirus, said a source with direct knowledge of a government serological survey, suggesting the country's real caseload was many times higher than reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X