వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాపను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణానాతీతం.. మీ సాయం కావాలి

Google Oneindia TeluguNews

తమకు మొదటగా, కొత్తగా అప్పుడే పుట్టిన పాపాయితో సంబరాలు చేసుకునే అదృష్టం అందరు తల్లిదండ్రులకూ ఉండదు. ఆ తల్లిదండ్రుల పేర్లు కె.శివ, సాయిప్రియ. వారికి ఈ ఏడాది ఏప్రిల్ 18 న పాప పుట్టింది. తమ ఇంట్లోకి మహాలక్ష్మి అడుగుపెట్టిందని ఆనందం వారికి కొన్ని క్షణాలు కూడా లేదు. వారు పాపకు తల్లిదండ్రులయ్యాక నవ్వడం పూర్తిగా మర్చిపోయారు. పాప పుట్టిందనే శుభవార్తను బంధువులతో, స్నేహితులతో కూడా చెప్పుకోలేని బాధలో వారు ఉన్నారు. పాప చాలా ప్రీమెచ్యూర్ గా పుట్టింది, ఏడో నెలలోనే చాలా నియోనేటల్ సమస్యలతో పుట్టింది. వెంటనే, పీడియాట్రిషియన్ తనను వెంటిలేటర్ లో పెట్టారు. ఒక నెల తర్వాత కూడా శివ,ప్రియల పాప హైదరాబాద్ లోని లిటిల్ స్టార్స్ చిల్డ్రన్ హాస్పిటల్ లోనే ఉంది. ఇప్పుడు కొంచెం పెద్దగా కన్పిస్తోంది కానీ ఆమె బరువు ఏమంత పెరగలేదు. బేబీ ఇంకా చాలా పాలిపోయినట్లు ఉన్నది, తరచుగా చెప్పలేని నొప్పితో ఏడుస్తుంది

సాయిప్రియ ఆరోగ్య సమస్యలు పాపాయి పుట్టకముందు నుంచే మొదలయ్యాయి. ఆమెకి ఒంట్లో బాగుండేది కాదు. ఒకరోజు రాత్రి ఆమెకు శ్వాస తీసుకోవడం కష్టమైపోతే, తన భర్త, ఎయిర్ సెల్ ఉద్యోగి అయిన శివ ఆమెను వెంటనే స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు. డాక్టర్లు బేబీని ముందుగానే సి-సెక్షన్ సర్జరీ ద్వారా డెలివరీ చేసేయటం మంచిదని లేకపోతే తల్లీబిడ్డ ఇద్దరూ అపాయంలో పడతారని సూచించారు.

పాప పుట్టాక, ప్రియ తన ఆపరేషన్, ఇంకా ఇబ్బంది పెడుతున్న లక్షణాలనుండి త్వరగానే కోలుకుంది. తర్వాత రెండు వారాలలో, ఆమె శరీరంలో సమస్యలన్నీ మాయమైపోయాయి. కానీ తన చింత మొత్తం పాపాయి గురించే. బేబీ ఇంకా తల్లిపాలు మొదలు కూడా పెట్టలేదు, ఒళ్లంతా ట్యూబులు, సూదులతో వెంటిలేటర్ లో ఉంది. సన్నగా ఉండి, ముట్టుకున్నప్పుడల్లా ఏడ్చేది.

హాస్పిటల్ బిల్లులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. శివ, ప్రియలు తమ పాప స్థితితో చాలా కుంగిపోయారు. ఇక వారికి ఈ కష్టాలు చాలవన్నట్లుగా మరో కష్టం కూడా వచ్చింంది. శివ ఉద్యోగం కూడా పోయింది. అతను నెలకు 15000 రూపాయలు సంపాదించేవాడు, ఈ మొత్తం తన చిన్న కుటుంబం నెలవారీ అవసరాలకి ఖర్చులకే సరిపోయేది, అత్యవసర ఎమర్జెన్సీలకి పొదుపు చేసే అవకాశం లేకపోయింది. నిజానికి ఈ ఎమర్జెన్సీ వస్తుందనే ఊహ కూడా వారికి లేదని, అది కూడా తమ పాపకి ఇలా అవుతుంఅని అనుకోలేదని శివ తెలిపాడు.

బేబీ చికిత్స కోసం శివ తన స్నేహితులు, బంధువుల నుంచి పెద్ద మొత్తాల్లోనే అప్పు తీసుకున్నాడు. మే లో హాస్పిటల్ చేతిలో 4.5 లక్షల రూపాయల బిల్లు పెట్టగానే, అతను తన పూర్వీకుల బంగారు నగలను అమ్మేసి డబ్బు సమకూర్చటానికి ప్రయత్నించాడు శివకి కానీ, ప్రియకి కానీ తమ ఆస్తులు వదులుకున్నందుకు ఏమాత్రం బాధలేదు. "మా పాప త్వరగా ఇంటికి రావాలి,మిగిలినదంతా దాని తర్వాతనే," అంటూ ప్రియ చాలా బాధగా చెప్పారు.

బేబీ కోలుకోవటానికి చికిత్సకి ఇంకా 8 లక్షల రూపాయలు అవుతాయి.ఈ సమయం శివకి, ప్రియకి చాలా కష్టమైనది. వచ్చే ఆదాయం లేదు. బేబీ చికిత్సకి పెట్టడానికి డబ్బు లేదు. ఏదో అద్భుతమో, మాయ జరిగితే తప్ప 8 లక్షలు సమకూర్చటం వారికి అసాధ్యమైన పని.

మీరు శివకి తన పాప చికిత్స కోసం సాయపడాలనుకుంటే, అతనికి విరాళం ఇక్కడ ఇవ్వండి అలాగే తన కథను ఫేస్బుక్, వాట్'సాప్ లలో మీ దగ్గరివారితో పంచుకోండి. పాప బతకడానికి మీ వంతు సాయం చేయండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X