వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ లో ఉగ్రదాడి, 30 మంది మృతి, అమెరికా నిర్లక్షంతో దాడి, మంత్రి, చైనా రాయబారి ఆఫీస్!

|
Google Oneindia TeluguNews

కరాచి: పాకిస్తాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ దగ్గర, చైనా రాయబారి కార్యాలయం సమీపంలో శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో ఇప్పటి వరకు 30 మంది మరణించారు. 40 మందికి పైగా తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.

ముస్లీం సోదరులకు ఎంతగానే పవిత్రమైన శుక్రవారం ఉగ్రవాదులు పంజా విసిరారు. నిత్యం రద్దీగా ఉండే కైబర్ ఫక్వువా ప్రావిన్స్ లోని జుమ్మా మార్కెట్ సమీపంలో బాంబు దాడి జరిగింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన భారీ బాంబు పేలుడులో 30 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

పాకిస్తాన్ మానవహక్కుల శాఖా మంత్రి షీరిన్ మజారీ స్థానిక మీడియాతో మాట్లాడుతూ బాంగ్లాదేశ్ ఉగ్రవాదులను అరికట్టడంలో అమెరికా పూర్తిగా విఫలం అయినందుకే ఈ రోజు బాంబు దాడి జరిగిందని ఆరోపించారు. ఉగ్రదాడి జరిపిన వారిని ఎలాంటి పరిస్థితిలో వదిలిపెట్టమని పాక్ మంత్రి షీరిన్ మజారీ హెచ్చరించారు.

ఫైబర్ ఫక్వువా ప్రాంతంలో మైనారిటీ వర్గానికి చెందిన షియా ముస్లీంలు అధికంగా ఉండే ప్రాంతంలో బాంబు దాడి జరిగిందని, అదే వర్గానికి చెందిన వారు ఈ బాంబు దాడిలో మరణించారని అధికారులు అంటున్నారు. షియా ముస్లీంలను లక్షంగా చేసుకుని బాంబు దాడి జరిగిందని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని పోలీసు అధికారులు అంటున్నారు.

బైక్ కు రిమోట్ బాంబు అమర్చి పేల్చారని పోలీసు అధికారులు అంటున్నారు. ఇయితే ఇప్పటి వరకు ఈ బాంబు దాడికి మేమే కారణం అని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని స్థానిక పోలీసులు చెప్పారు. బాంబు దాడి జరిగిన వెంటనే ఆందోళనతో స్థానికులు, సంఘటనా స్థలంలో ఉన్న వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగుతీశారని ప్రత్యక్షసాక్షులు చెప్పారని పోలీసులు తెలిపారు.

30 killed, 40 injured in bomb blast in Pakistan

తాలిబన్ ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2011లో పాక్ లో వ్యాన్ లో వెళ్లిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో 10 మంది పోలీసులతో సహ 30 మంది మరణించారు. 50 మందికి పైగా తీవ్రగాయాలైనాయి.

English summary
A bomb blast ripped through a busy market outside a religious seminary in Pakistan's restive Khyber Pakhtunkhwa province on Friday, killing at least 30 people and injuring over 40 others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X