వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.200 బాకీ 30 ఏళ్ల తర్వాత తీర్చాడు.. ఎంత ఇచ్చాడో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ముంబై : మంచికి రోజులు లేవు. చేసిన మంచిని గుర్తుంచుకోవడం లేదు. అప్పు తీసుకొని మరచిపోతున్నారు. తిరిగి అడిగినా ఇవ్వని రోజులివి. కానీ కెన్యా ఎంపీ మాత్రం అలా కాదు. తాను తీసుకున్న రూ.200కు వందింతలు ఇచ్చేశారు. అయితే ఒకటి కాదు రెండు కాదు ముప్ఫై ఏళ్ల తర్వాత తన రుణం తీర్చడంతో .. అంత పెద్ద మొత్తంలో ఇచ్చేశాడు.

 వేధించిన అప్పు ..

వేధించిన అప్పు ..

రిచర్డ్స్ న్యాగక టోంగీ కెన్యా ఎంపీ, విదేశీ వ్యవహారాల సమితి అధ్యక్షుడు కూడా. ఇప్పుడు కెన్యాలో మంచి స్థాయిలో ఉన్నారు. అయితే ఆయన చదువుకుంది మాత్రం ఔరంగబాద్‌లో. 1985 నుంచి 1989 వరకు మౌలానా ఆజాద్ కాలేజీలో చదువుకున్నారు. అప్పుడు సాధారణ పౌరుడిలా ఒక గదిలో అద్దుకు ఉంటూ చదువుకొన్నారు. రూమ్ దగ్గరలో ఉన్న కిరాణా షాపులో సరుకులు తెచ్చుకునేవారు. అలా ఒకసారి రూ.200 సరుకులు అప్పుగా తీసుకున్నారు. కానీ అనుకోకుండా కెన్యా రావల్సి వచ్చింది. దీంతో చేసిన అప్పు తీర్చలేకపోయారు.

 కెన్యాకే పరిమతం ...

కెన్యాకే పరిమతం ...

కెన్యా వచ్చిన రిచర్డ్స్ .. తిరిగి ఇండియా రాలేదు. కానీ చేసిన అప్పు మాత్రం ఆయనను వెంటాడింది. తర్వాత రాజకీయాల్లోకి రావడం, ఎంపీగా గెలవడం జరిగిపోయాయి. ఈ క్రమంలో ఇటీవల కెన్యా ప్రతినిధి బృందం ప్రధాని మోడీని కలిసేందుకు భారత్ వచ్చింది. అందులో రిచర్డ్స్ కూడా ఉన్నారు. మోడీతో సమావేశం తర్వాత ఆయన ఔరంగాబాద్ చేరుకున్నారు. తాను అప్పు చేసిన వ్యాపారి అడ్రస్ వెతికారు. తాను 30 ఏళ్ల క్రితం చేసిన రూ.200 అప్పుకు బదులుగా 250 యూరోలు ఇచ్చారు. అంటే మన కరెన్సీలో 19 వేల 200 రూపాయలు. ఈ సందర్భంగా పాత స్మృతులను గుర్తుచేసుకున్నారు.

ఆశ్చర్యం ....

30 ఏళ్ల క్రితం రూ.200 అంటే పెద్దమొత్తమే. దానిని తాను ఇవ్వలేకపోయానని రిచర్డ్స్ మదనపడ్డారు. చాలారోజుల తర్వాత ఇండియాకు వచ్చారు. తాను చేసిన అప్పు గుర్తొచ్చి .. ఔరంగాబాద్ చేరుకున్నారు. ఆ కిరాణా షాపు వ్యక్తిని కనుగొన్ని మరీ తన బాకీని ముట్టజెప్పారు. తాను ఇవ్వని రూ.200కు బదులుగా రూ.20 వేల నగదు ఇవ్వడంపై షాపు యాజమాని సంబర పడిపోయారు. గుర్తుంచుకొని మరీ తనను వెతికి ఇవ్వడంతో ఎంపీది ఎంతో గొప్ప మనసు అర్థం అవుతుందన్నారు.

English summary
septuagenarian Kashinath Gawli was overcome with emotion as he found an MP from Kenya at his doorstep in Aurangabad, returning to the historic city after 30 years, just to repay a debt of Rs 200.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X