వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

35000 మంది పోలీసుల హతం... 72 ఏళ్లలో...

|
Google Oneindia TeluguNews

గత డెబ్బై సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా 35 వేల 156 మంది పోలీసులు అసువులు బాసారని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. వీరంతా క్రాస్ బోర్డర్ టెర్రరిజంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నక్సలైట్లు, తీవ్రవాదులు, లిక్కర్ మరియు సాండ్ మాఫియాల మరియు ఇతర లా అండ్ ఆర్డర్ పరిస్థితులు చేజారి పోయిన సంధర్భాల్లో మృత్యువాత పడ్డారు. అయితే వీరంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం ఏర్పడినప్పడి నుండి ఆగస్టు 2019 వరకు జరిగిన వివిధ దాడుల్లో మృత్యువులోకి వెళ్లారు.

దేశంలో చెలరేగుతున్న అల్లర్లు

దేశంలో చెలరేగుతున్న అల్లర్లు

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడ దేశంలో ఎక్కడో ఓచోట హింసాత్మక సంఘటనలు చోటుకుంటున్న దుస్థితి మనకు తెలిసిందే. కులాలు,మతాల మధ్య ఘర్షణలు, వీటికి తోడు ఆసాంఘీక కార్యకలాపాలు నిర్వహించే ధోరణి ప్రజల్లో రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతోపాటు ప్రజల్లో అసంతృప్తి చెలరేగుతుండడంతో అల్లర్లు, ఆందోళనలు నిత్యం కొనసాగతున్నాయి.

శాంతిభద్రతలకు ప్రధాన ఆయుధంగా మారిన పోలీసులు

శాంతిభద్రతలకు ప్రధాన ఆయుధంగా మారిన పోలీసులు

అయితే దేశంలో జరిగే అన్ని అందోళనలు, అక్రమాలను కట్టడి చేసేందుకు పోలీసు వ్యవస్థ మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. దీంతో కొన్ని సంధర్బాల్లో పోలీసులు తమ ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితి కల్గుతోంది..దీంతో దేశాన్ని రక్షించే సమయంతో పాటు అసాంఘిక శక్తులను ఎదుర్కోవడంలో భాగంగా ఎన్నో వేల మంది పోలీసులు అసువులు బాస్తున్నారు. దీంతో వారిని స్మరించుకునేందుకు ఆక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1959లో చైనీస్ కాల్పుల్లో 10 మంది భారత జవానులు మృతి చెందడంతో దేశవ్యాప్తంగా పోలీసుల అమవీరుల సంస్మరణ దినోత్సవాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే..

దేశవ్యాప్తంగా 35 వేల మంది పోలీసుల మరణం

దేశవ్యాప్తంగా 35 వేల మంది పోలీసుల మరణం

ఈ సంధర్భంగా పోలీసుల అమరుల మరణాలపై సీఆర్‌ఎఫ్ దళాలు వెల్లడించాయి. ఇలా ఇప్పటి వరకు దేశం కోసం అసువులు బాసిన పారమిలిటరి జవానుల్లో మొత్తం 35 వేల 136 మంది ఉన్నారని తెలిపారు. కాగా వీరంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం ఏర్పడినప్పడి నుండి ఆగస్టు 2019 వరకు జరిగిన వివిధ దాడుల్లో మృతిచెందారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే 2018 సెప్టెంబర్ నుండి 2019 ఆగస్టు వరకు సీఆర్‌పీఎఫ్ జవానులతో కలిపి ఇతర రంగాలకు చెందిన మొత్తం 292 మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారని వివరించారు.. ఇందులో పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవానులు ఉగ్రవాదుల దాడిలో ఒకేసారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఇక వీరితోపాటు 41 మంది బీఎస్ఎఫ్, 23 మంది ఐటీబీపీ 24 మంది జమ్ము కశ్మీర్ పోలీసులు ఉండగా 20 మంది మహారాష్ట్ర లోని గడ్చి రౌలిలోని లైండ్‌మైన్‌కు బలైన వారు కూడ ఉన్నారు.

English summary
The police personnel were martyred From Independence to August 2019, total 35,136 police personnel sacrificed their lives for safeguarding the nation and providing security to people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X