వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లో ఆంక్షల ఎత్తివేత: తెరుచుకున్న దుకాణాలు, పాఠశాలలు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు 5 నుంచి ఈ ఆంక్షలు అమలులో ఉన్నాయి. తాజాగా ఈ ఆంక్షలను ఎత్తివేశారు.

జమ్మూలో మాత్రం కొద్ది రోజుల క్రితమే ఆంక్షలు ఎత్తివేశారు. ఇక్కడ పరిస్థితులు సాధారణంగానే ఉండటంతో ముందుగానే ఆంక్షలను ఎత్తివేశారు. తాజాగా కాశ్మీర్‌లో కూడా ఆంక్షలను ఎత్తివేశారు. ఇక్కడ కూడా సాధారణ పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో చాలా రోజుల తర్వాత దుకాణాలు తెరుచుకున్నాయి. అక్కడ సందడి వాతావరణం కనిపించింది.

 36 days later, restrictions lifted from most areas of Kashmir

ఇప్పుడిప్పుడే పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. ఇక సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రమే ఇప్పుడు ఆంక్షలు అమలులో ఉన్నాయి. అక్కడ కూడా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినట్లయితే ఆంక్షలను ఎత్తివేయనున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు ఇటీవల వచ్చిన జమ్మూకాశ్మీర్ ప్రతినిధులకు మరో 15రోజుల్లో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆంక్షలు ఎత్తివేయడం గమనార్హం.

English summary
Restrictions were lifted from most areas of Kashmir, except some parts of Srinagar, on September 9 even as the stalemate in the Valley following abrogation of Article 370 entered its 36th day with schools closed and public transport off the roads, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X