వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిబంధనల ఉల్లంఘన: బ్రిటన్‌లో 38 మంది భారతీయుల నిర్బంధం

38 మంది భారతీయులను బ్రిటన్‌ ఇమిగ్రేషన్‌ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వీసా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తొమ్మిది మంది మహిళలు. మరొక ఆఫ్గాన్‌ జాతీయుడు క

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/లండన్‌: 38 మంది భారతీయులను బ్రిటన్‌ ఇమిగ్రేషన్‌ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వీసా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తొమ్మిది మంది మహిళలు. మరొక ఆఫ్గాన్‌ జాతీయుడు కూడా అరెస్టు అయ్యాడు.

లీచెస్టర్‌ నగరంలోని రెండు వస్త్ర కర్మాగారాలపై ఇమిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం గతవారం దాడులు నిర్వహించగా వీరు పట్టుబడ్డారు. 31 మంది వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలోనే కొనసాగుతున్నారని గుర్తించారు అధికారులు.

38 Indians detained in Britain for overstaying their visas

అంతేగాక, ఏడుగురు దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని, ఒకరు వీసా నిబంధనలను ఉల్లంఘించి ఉద్యోగం చేస్తున్నారని అధికారులను ఉటంకిస్తూ స్థానిక 'లీచెస్టర్‌ మెర్క్యూరీ' పత్రిక వెల్లడించింది.

కాగా, వీరిని ఉద్యోగులుగా చేర్చుకున్న రెండు కంపెనీలైన ఎంకే క్లాతింగ్‌ లిమిటెడ్‌, ఫ్యాషన్‌ టైమ్స్‌ యూకే లిమిటెడ్‌ పైనా భారీ జరిమానాలను విధించే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తెలిపారు.

English summary
At least 38 Indians have been detained by Britain's immigration officials for overstaying their visas or working illegally. Among the 38 Indians were nine women who were detained following raids in two clothing factories in the city of Leicester.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X