వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

382 మంది వైద్య సిబ్బంది వీరమరణం, చనిపోయింది చెప్పరా, కేంద్రమంత్రిపై ఐఎంఏ గుర్రు..

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు 5 మిలియన్ దాటిన సంగతి తెలిసిందే. అయితే రోగులకు వైద్య సేవలు అందిస్తోన్న క్రమంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా వైరస్ రక్కసికి బలయ్యారు. అయితే వైద్య సిబ్బంది విధిలో ఉన్నప్పుడు మరణించిన అంశం గురించి వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పార్లమెంట్‌లో ప్రసంగించడంతో వివాదం రేపింది. మంత్రి ప్రకటనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖండించింది. కరోనా వైరస్ ప్రబలినప్పిటీ నుంచి నేటి వరకు చనిపోయిన వారి వివరాలను వెల్లడించింది. డేటా వెల్లడించకపోవడమే గాక.. ఉదాసీనంగా వ్యవహారించడం ఏంటీ అని ఐఎంఏ మండిపడింది.

11 రోజుల్లో 10 లక్షలు: దేశంలో 50 లక్షలు దాటిన కరోనా కేసులు..11 రోజుల్లో 10 లక్షలు: దేశంలో 50 లక్షలు దాటిన కరోనా కేసులు..

 సరికాదు..

సరికాదు..

వైరస్ సోకిన వైద్యులు/ సిబ్బంది పట్ల ఇలా కామెంట్ చేయడం సరికాదని ఐఎంఏ పేర్కొన్నది. ప్రాణాలకు ఒడ్డి వైద్యం అందజేస్తే.. చనిపోయిన వారిని స్మరించకపోవడం దారుణమన్నారు. దీంతో ప్రభుత్వం 1897 ఎపిడమిక్ యాక్ట్ నిర్వహించే అధికారం కోల్పోయిందని మండిపింది. ఇప్పటివరకు 382 మంది వైద్యులు విధి నిర్వహణలో చనిపోయారని తెలిపింది. ఇందులో 27 ఏళ్ల వయస్సు వారు, 85 ఏళ్ల వృద్దులు కూడా ఉన్నారని వివరించింది. కరోనా వైరస్ సందర్భంగా వైద్యులు చేస్తున్న సేవలను కొనియాడిన కేంద్రమంత్రి.. హీరోల పరిత్యాగాన్ని స్మరించకపోవడం దారుణమని ఐఎంఏ ఆగ్రహాం వ్యక్తం చేసింది.

 గోప్యత ఎందుకో.. అర్థం కావడం లేదు..

గోప్యత ఎందుకో.. అర్థం కావడం లేదు..

వైరస్ ప్రబలుతోన్న సందర్భంలో వైద్యులు చేస్తున్న కృషిని గుర్తించాలని.. దేశానికి సమాచారం అందించాలని వివరించింది. కానీ దాచిపెట్టాల్సిన గోప్యత ఇందులో ఏముందో అర్థం కావడం లేదని అభిప్రాయపడింది. అంతేకాదు దేశంలో మాదిరిగా ఇతర దేశాల్లో వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోకూడదు అని గుర్తుచేసింది. దీంతోపాటు ప్రజారోగ్యం, ఆస్పత్రుల నిర్వహణ రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని కేంద్రమంత్రి అశ్వినికుమార్ చౌబే చేసిన ప్రకటనను ఐఎంఏ గుర్తుచేసింది. అందుకోసమే పరిహారం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు అని సూచించిన అంశాన్ని ప్రస్తావించింది.

లెక్కించకుంటే చనిపోయినట్టు కాదా..?

లెక్కించకుంటే చనిపోయినట్టు కాదా..?

అయితే మార్చిలో మాత్రం పారిశుద్ద్య సిబ్బంది కోసం రూ. 22.12 లక్షలు, వైద్యారోగ్య సిబ్బంది కోసం రూ50 లక్షల బీమా కల్పిస్తామని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కానీ తర్వాత మంత్రులు చేసిన వ్యాఖ్యలతో విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తోంది. విధి నిర్వహణలో చనిపోయిన వైద్యులకు సంబంధించి.. మీరు లెక్కించకుంటే వారి చనిపోయినట్టు కాదా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.

English summary
Union health minister Dr Harshavadhan's statement on coronavirus in parliament, which had no word on the doctors who died in the line of duty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X